రెడ్ మీ టర్బో 3 స్మార్ట్ ఫోన్ ఫీచర్లు మామూలుగా లేవుగా.. లాంచింగ్ ఎప్పుడంటే..?
TeluguStop.com
ప్రముఖ స్మార్ట్ ఫోన్లు తయారీ సంస్థ షియోమీ( Xiaomi ) నుంచి రెడ్ మీ టర్బో 3 స్మార్ట్ ఫోన్ త్వరలోనే లాంచింగ్ కానుంది.
అయితే ఆన్ లైన్ లో ఈ స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన డిజైన్ తో పాటు స్పెసిఫికేషన్ వివరాలు లీక్ అయ్యాయి.
ఆ వివరాలు ఏమిటో చూద్దాం. """/" /
H3 Class=subheader-styleరెడ్ మీ టర్బో 3 స్మార్ట్ ఫోన్:/h3p( Redmi Turbo 3 ) ఈ ఫోన్ 6.
78 అంగుళాల OLED డిస్ ప్లే తో వస్తోంది.144Hz రిఫ్రెష్ రేట్ కలిగి 6000mAh బ్యాటరీ ( 6000mAh Battery ) సామర్థ్యం తో 80W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ కు మద్దతు ఇస్తుంది.
ఈ ఫోన్ వెనుక ప్యానెల్ రింగ్ లాంటి ఫ్లాష్ యూనిట్ తో పాటు రెండు కెమెరా సెన్సార్ లతో ఉంటుంది.
ఇక పవర్ బటన్, వాల్యూమ్ రాకర్స్ హ్యాండ్ సెట్ యొక్క కుడి వైపు అంచున ఉంచబడ్డాయి.
"""/" /
ఈ రెడ్ మీ టర్బో3 స్లిమ్ బెజెల్స్ తో పాటు డిస్ ప్లే, ఫ్రంట్ కెమెరా కోసం సెంటర్ హోల్-పంచ్ స్లాట్ ను కలిగి ఉంటుందని అధికారిక Weibo పోస్ట్ వెల్లడించింది.
ఈ రెడ్ మీ టర్బో 3 ఫోన్ 7.8 మి.
మీ మందం,179 గ్రాముల బరువు కలిగి ఉంటుంది.టాప్ వేరియంట్ 16GB RAM మరియు 1TB ఆన్ బోర్డ్ స్టోరేజ్ తో రానుంది.
ఈ ఫోన్ షియోమీ Hyper OS ను అవుట్-ఆఫ్-ది-బాక్స్ గా కూడా తీసుకువస్తుంది.
షియోమీ యొక్క చైనా వెబ్ సైట్ లోని ల్యాండింగ్ పేజీ సమాచారం ప్రకారం.
ఏప్రిల్ 10వ తేదీ చైనా మార్కెట్లో రెడ్ మీ టర్బో 3 లాంచ్ అవ్వనుంది.
ఈ ఫోన్ గోల్డెన్, గ్రీన్, బ్లాక్ కలర్లలో లభిస్తుంది.ఈ ఫోన్ కు సంబంధించిన ధర వివరాలు లాంచింగ్ సమయంలో తెలియనున్నాయి.
టాలీవుడ్ లో మహేష్ బాబు సంచలన రికార్డ్.. బ్రేక్ చేయడం ఏ హీరోకైనా కష్టమేనా?