ఎర్రగంగోలి పురుగుల నుంచి ఆముదం పంటను సంరక్షించుకునే పద్ధతులు..!

ఆముదం పంట( Castor Bean Crop ) సాగులో ప్రపంచంలోనే భారతదేశం మొదటి స్థానంలో ఉంది.

ఆముదం నూనెను( Castor Oil ) పలు రకాల పరిశ్రమలలో, మందుల తయారీలలో, రంగులు, ముద్రణ కోసం తయారుచేసే సిరా తయారీలలో ఉపయోగించడం వల్ల మార్కెట్లో ఎప్పుడు డిమాండ్ ఉంటుంది.

అన్ని రకాల నేలలు ఆముదం పంట సాగుకు అనుకూలంగా ఉంటాయి.నేలలలో నీరు ఇంకే నేలలలో అయితే అధిక దిగుబడి పొందవచ్చు.

ఆముదం పంటను ఆశించే ఎర్ర గంగోలి పురుగులను( Red Caterpillar ) సకాలంలో గుర్తించి నివారణ చర్యలు చేపడితే అధిక దిగుబడి పొంది అధిక లాభాలు పొందవచ్చు.

Red Caterpillar Damage To Castor Bean Crop Preventive Measures Details, Red Cate

ఈ పురుగుల నివారణకు సరైన సస్యరక్షక పద్ధతులు క్రమం తప్పకుండా పాటించి పంటను సంరక్షించుకోవాలి.ఎర్ర గంగోలి పురుగులు: ఈ పురుగులు పైరు మొలిచిన వెంటనే పంటను ఆశిస్తాయి.లేత ఆకులు, లేత కాండం, లేత కొమ్మలను ఆశించి పూర్తిగా తినడం వల్ల మొక్క మోడు బాడుతుంది.

Advertisement
Red Caterpillar Damage To Castor Bean Crop Preventive Measures Details, Red Cate

ఒక పొలం నుంచి మరొక పొలానికి గుంపులు గుంపులుగా వాలిపోయి ఆముదం పంటకు తీవ్ర నష్టం కలిగిస్తాయి.ఈ పురుగులు ఎరుపు గోధుమ రంగులో ఉండి, నల్లని చారలు కలిగి ఉంటాయి.

పురుగు శరీరమంతా ఎరుపు గోధుమ రంగు వెంట్రుకలు ఉంటాయి.ఇక తల్లి పురుగులు తెలుపు రంగు రెక్కలను కలిగి ఉండి, రెక్కల అంచున పసుపు పచ్చని చారలు కలిగి ఉంటాయి.

Red Caterpillar Damage To Castor Bean Crop Preventive Measures Details, Red Cate

ఈ పురుగులను నివారించాలంటే.ముందుగా వేసవిలో భూమిలో లోతు దిక్కులు దున్నుకోవాలి.లోతు దుక్కుల వల్ల భూమి లోపలి పొరల్లో దాగి ఉన్న పురుగులు ఎండ తీవ్రతకు, పక్షుల బారినపడి చనిపోతాయి.భూమి లోపల నాగలితో లోతుగా సాలును దున్ని అందులో మిథైల్ పెరధియాన్ 2శాతం, క్వినాల్ ఫాస్ 1.5 శాతం పొడిమందును చల్లి నివారించవచ్చు.పంట వేశాక ఈ పురుగులు ఆశించిన సమయంలో ఒక లీటరు నీటిలో 1.6 మి.లీ మోనోక్రోటోఫాస్ కలిపి మొక్కలు పూర్తిగా తడిచేలాగా పిచికారి చేసి ఈ పురుగులను పూర్తిగా అరికట్టవచ్చు.

తాజా వార్తలు