కోచింగ్ ఫ్యాక్టరీలో విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌ల‌కు కార‌ణాలివే...

రాజస్థాన్‌లోని కోట నగరం ఒక నగరంలా కాకుండా కోచింగ్ ఫ్యాక్టరీగా మారిపోయింది.‘కట్-థ్రోట్ కాంపిటీషన్’ మధ్య ఇంజినీరింగ్ లేదా మెడికల్ కోర్సులలో అడ్మిషన్ హామీగా చెప్పుకునే నగరంగా కోట నిలుస్తోంది.రాజస్థాన్‌లోని ఈ నగరంలో సుమారు 4000 కోట్ల విలువైన కోచింగ్ పరిశ్రమ పగలు, రాత్రి అలుపెర‌గ‌క ప‌నిచేస్తోంది.దాదాపు 2 దశాబ్దాలుగా అంటే 20 ఏళ్లుగా ఏటా వేల, లక్షల మంది విద్యార్థుల‌కు ‘చదువుల గమ్యస్థానం’గా మారింది.12వ తరగతి చదువుతున్న లేదా ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల‌లో, వారి తల్లిదండ్రులతో కోట‌ న‌గ‌రాన్ని దాటకుండా ఇంజనీర్, డాక్టర్ కావడం సాధ్యం కాదనే నమ్మకం ఏర్పడింది.ఈ ఆలోచనతోనే కోట‌ రాజస్థాన్‌లోని మూడవ అతిపెద్ద నగరంగా మారింది.

 Reasons For Suicide Of Students In Coaching Factory , Reasons For Suicide Of Stu-TeluguStop.com

వందలాది కోచింగ్ సెంటర్లతో ఒక ఫ్యాక్టరీగా ప‌రిణ‌మించింది.

ఎన్‌సీఆర్‌బీ గణాంకాలు బట్ట‌బ‌య‌లు దేశంలోని నలుమూలల నుంచి ఈ కోచింగ్ సెంటర్లలో అడ్మిషన్ తీసుకునే కొందరు పిల్లలు ఆశించిన ఫలితాలు రాకపోవ‌డంతో ఆత్మహత్యల వంటి చర్యలకు వెనుకాడటంలేదు.

Telugu Factory, Engineer, Kota Nagaram, National Bureau, Rajasthan-Latest News -

ఎన్‌సిఆర్‌బి అంటే నేషనల్ క్రైమ్ బ్యూరో.ఇది అందించిన‌ గణాంకాలను పరిశీలిస్తే, పరీక్షల భయంతో ఆత్మహత్య చేసుకున్న పిల్లల సంఖ్య‌ 862 అని తేలింది.గత ఏడాది కోచింగ్ సెంట‌ర్ల‌లో చేరిన 22 మంది విద్యార్థులు కోటాలో మరణించారని రాజస్థాన్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ పేర్కొంది.ఇందులో 18 మంది విద్యార్థులు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

ఖరీదైన ఫీజులు ఇంటి నుంచి వేల కిలోమీటర్ల దూరంలో ఉండ‌టం, పరీక్షలో ఫెయిల్ అవుతామనే భయంతో విద్యార్థులు ముందుగా డిప్రెషన్‌కు లోనవుతారు.ఆ తర్వాత ఆత్మహత్యల వంటి అనూహ్య‌ చర్యల‌కు పాల్ప‌డ‌తారు

Telugu Factory, Engineer, Kota Nagaram, National Bureau, Rajasthan-Latest News -

ఈ కారణాలతోనే విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌లు తీవ్రమైన రొటీన్, కట్-థ్రోట్ కాంపిటీషన్ మరియు హోమ్ సిక్‌నెస్ వంటి అంశాలు విద్యార్థుల‌లో డిప్రెషన్‌ను పెంచుతాయి.ఇంజనీరింగ్, మెడికల్ కోర్సులలో సీటు ఆశించే విద్యార్థులు ఆందోళ‌న‌తో ఆత్మహత్యల‌కు పాల్ప‌డుతున్నారు.ఈ తీవ్ర నిరాశలోకూర‌కుపోయిన విద్యార్థులు తల్లిదండ్రులకు మరియు కుటుంబ సభ్యులకు జీవితకాలపు దుఃఖాన్ని అందిస్తున్నారు.

ఎన్నో ఆశలతో తమ ప్రాంతాల‌ నుంచి కోటకు చేరుకునే విద్యార్థులకు ఈ నగరం ఆత్మహత్యలకు వేదికగా మారుతున్న‌ద‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి.విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌ల నివార‌ణ‌ రాజస్థాన్ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

కోచింగ్ సెంటర్లు మరియు పీజీ-హాస్టళ్లను నడుపుతున్న యాజ‌మాన్యాల‌కు కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది.వీటి ప్ర‌కారం ఇక‌పై అబ‌ద్ధ‌పు ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చే కోచింగ్ సెంట‌ర్ల‌పై క‌ఠిన చ‌ర్య‌లు అమ‌లు కానున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube