తారకరత్నను విదేశాలకు తీసుకెళ్లడం వెనుక అసలు కారణాలేంటో మీకు తెలుసా?

నందమూరి తారకరత్న ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.అయితే రోజులు గడుస్తున్నా తారకరత్న పూర్తిస్థాయిలో కోలుకున్నాడని ఆయన ఆరోగ్యం సాధారణ స్థితికి వచ్చిందని ఎలాంటి వార్తలు వినిపించలేదు.

 Reasons Behind Tarakaratna Health Details Here Goes Viral , Tarakaratna , Health-TeluguStop.com

తారకరత్న మెదడుకు సంబంధించిన సమస్యలతో బాధ పడుతున్నారని తాజాగా విజయసాయిరెడ్డి వెల్లడించిన సంగతి తెలిసిందే.

ఎయిర్ ఆంబులెన్స్ లో తారకరత్నను విదేశాలకు తీసుకెళ్లనున్నారని తెలుస్తోంది.

ప్రముఖ టీడీపీ నేత చేసిన కామెంట్ల వల్ల తారకరత్న ఆరోగ్యం గురించి మరోసారి చర్చ జరుగుతోంది.అయితే తారకరత్న వేర్వేరు ఆరోగ్య సమస్యలతో బాధ పడుతుండటం వల్లే విదేశాల్లో వైద్య చికిత్స చేయించుకుంటే మంచిదని వైద్యులు చెప్పారని సమాచారం.

తారకరత్న త్వరగా కోలుకోవాలంటే ఈ విధంగా చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది.

Telugu Brain Problems, Kalyan Ram, Lokesh, Tarakaratna, Tollywood, Vijayasai Red

తారకరత్న కుటుంబ సభ్యులు చర్చించుకుని మెరుగైన వైద్యం కోసం తారకరత్నను విదేశాలకు తరలించనున్నారు.తారకరత్నకు షుగర్ ఉండటం వల్ల వైద్యులకు చికిత్స విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలుస్తోంది.ఇప్పటికీ తారకరత్న ఆరోగ్యం ఒకింత విషమంగానే ఉందని సోషల్ మీడియాలో కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

Telugu Brain Problems, Kalyan Ram, Lokesh, Tarakaratna, Tollywood, Vijayasai Red

ప్రముఖ ఆలయాలలో తారకరత్న కోలుకోవాలని పూజలు జరుగుతుండగా ప్రస్తుతం ప్రత్యేక వైద్య బృందం తారకరత్నకు చికిత్స అందిస్తోంది.తారకరత్న వేగంగా కోలుకోవడానికి ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని ఆయన కుటుంబ సభ్యులు వదులుకోవడానికి ఇష్టపడటం లేదని సమాచారం అందుతోంది.తారకరత్న ఆరోగ్యానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.ట్యాబ్లెట్స్ వాడకుండా కేవలం ఆరోగ్య సూత్రాలను ఫాలో కావడం వల్లే ఆయనకు ఈ పరిస్థితి వచ్చిందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

తారకరత్న వయస్సు కేవలం 39 సంవత్సరాలు కాగా ఇండస్ట్రీలో వివాదాలకు దూరంగా ఉండే హీరోగా ఈ హీరోకు పేరుంది.రాజకీయాల్లో కెరీర్ ను మొదలుపెట్టాలని తారకరత్న భావిస్తున్న సమయంలో ఈ విధంగా జరిగింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube