ఆ ఒక్క పొరపాటే తారకరత్న ప్రాణం తీసిందా.. పాదయాత్ర రోజు ఏమైందంటే?

గత 23 రోజులుగా చికిత్స తీసుకుంటున్న తారకరత్న కోలుకుని సాధారణ మనిషి అవుతారని అందరూ భావించగా ఎవరూ ఊహించని విధంగా చికిత్స పొందుతూ తారకరత్న మృతి చెందారు.అయితే నందమూరి తారకరత్న చేసిన ఒకే ఒక్క పొరపాటు ఆయన ప్రాణం తీసిందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

 Reasons Behind Taraka Ratna Death Details Here Goes Viral In Social Media,taraka-TeluguStop.com

లోకేశ్ పాదయాత్ర మొదలైన రోజున ఉదయం నుంచి తారకరత్న అస్వస్థత ఫీలయ్యారని సమాచారం.

Telugu Bengaluru, Nandamuri, Taraka Ratna-Movie

తారకరత్న పాదయాత్రలో పాల్గొని ఎండలో తిరగడం వల్ల ఆయన సొమ్మసిల్లి పడిపోయారని సమాచారం.అదే సమయంలో గుండె పోటు రావడంతో పాటు కొంత సమయం రక్త ప్రసరణ ఆగిపోవడంతో మెదడులో రక్తం గడ్డ కట్టింది.వైద్యులు ఎంతో కష్టపడినా తారకరత్న ఈ సమస్య నుంచి పూర్తిస్థాయిలో కోలుకోలేదు.తారకరత్న మరణం నందమూరి అభిమానులను తీవ్రస్థాయిలో బాధ పెడుతోంది.

నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతూ తారకరత్న మృతి చెందడం గమనార్హం.

బ్రెయిన్ డ్యామేజ్ కావడం వల్ల కోమాలోకి వెళ్లిన తారకరత్న కోలుకోవడానికి వైద్యులు ఎన్నో ప్రయత్నాలు చేశారు.షుగర్ లెవెల్స్ పెరగడం వల్ల ఆయనకు గుండెపోటు వచ్చిందని సమాచారం.

వేర్వేరు ఆరోగ్య సమస్యలు తారకరత్న ఆరోగ్యంపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపారని తెలుస్తోంది.

Telugu Bengaluru, Nandamuri, Taraka Ratna-Movie

మరో నాలుగు రోజుల్లో తారకరత్న పుట్టినరోజు కాగా అదే సమయంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం ఫ్యాన్స్ ను మరింత హర్ట్ చేస్తోంది.పాదయాత్రకు హాజరు కాకుండా ఉండి ఉంటే తారకరత్నకు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.తారకరత్న ఆత్మకు శాంతి చేకూరాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తారకరత్న మృతికి సంతాపం తెలియజేశారు.నటుడు తారకరత్న భౌతికంగా మరణించినా సినిమాల ద్వారా ఆయన అభిమానుల హృదయాలలో జీవించి ఉన్నారనే చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube