విశ్వక్ సేన్( Vishwak Sen ) హీరోగా తెరకెక్కిన దాస్ కా ధమ్కీ సినిమా ( Das Ka Dhamki movie )నిన్న థియేటర్లలో విడుదలైందనే సంగతి తెలిసిందే.ఈ సినిమా కొంతమంది అద్భుతం అని మెచ్చుకుంటుంటే మరి కొందరు మాత్రం ఈ సినిమా యావరేజ్ అని కామెంట్లు చేస్తున్నారు.
దాస్ కా ధమ్కీ సినిమాకు నెగిటివ్ టాక్ రావడానికి కొన్ని తప్పులే కారణమని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.
ఈ సినిమా చూసిన ప్రేక్షకులు గౌతమ్ నంద, ఖిలాడీ, ధమాకా ( Gautam Nanda, Khiladi, Dhamaka )సినిమాలను మిక్స్ చేసినట్టు ఉందని ఆ సినిమాలను చూస్తే ఈ సినిమాను చూడాల్సిన అవసరం లేదని కామెంట్లు చేస్తున్నారు.మరోవైపు ఫస్టాఫ్ ఒక విధంగా సెకండాఫ్ మరో విధంగా ఉండటంతో కొందరికి ఫస్టాఫ్ నచ్చుతుండగా మరికొందరికి సెకండాఫ్ నచ్చుతోంది.
ఎక్కువ మొత్తంలో ట్విస్టులు ఉండటం కూడా ఈ సినిమాకు మైనస్ అవుతోంది.

ప్రేక్షకుల తెలివితేటలతో ఆడుకునేలా కొన్ని సీన్లు ఉండటం కూడా ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తోందని కామెంట్లు వినిపిస్తుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం.మరోవైపు హీరోయిన్ పాత్ర విషయంలో కొన్ని పొరపాట్లు జరిగాయి.హీరోయిన్ రోల్ ను కూడా నెగిటివ్ షేడ్స్ లో చూపించడం ఈ సినిమాకు మైనస్ అయిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

విశ్వక్ సేన్ ఇతర డైరెక్టర్ల డైరెక్షన్ లో నటిస్తే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.విశ్వక్ సేన్ ఈ కామెంట్ల గురించి ఎలా స్పందిస్తారో చూడాలి.టాక్ పూర్తిస్థాయిలో పాజిటివ్ గా ఉండి ఉంటే ఈ సినిమాకు మరింత ప్లస్ అయ్యేది.దాస్ కా ధమ్కీ నిర్మాతగా విశ్వక్ సేన్ కు కొంతమేర నష్టాలను మిగిల్చే ఛాన్స్ ఉంది.
ఈ సినిమా ఫలితంపై విశ్వక్ సేన్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.







