సంయుక్త మీనన్ఇటీవల కాలంలో ఈ అమ్మడి పేరు మారుమోగి పోతుంది.మలయాళంలో వరుస సినిమాలు చేసి అక్కడ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది.
ఇక మలయాళంలో నటిస్తూనే తమిళ్, తెలుగు భాషలపై ఫోకస్ పెట్టింది.ఈ క్రమంలోనే తెలుగులో భీమ్లా నాయక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.
రానా సరసన నటించి మెప్పించిన సంయుక్త మొదటి సినిమాతోనే హిట్ అందుకుంది.
ఇక ఆ తర్వాత కళ్యాణ్ రామ్ నటించిన బింబిసారా సినిమాలో కూడా నటించి రెండవ హిట్ అందుకుని.
ఇటీవలే సార్ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కూడా ఖాతాలో వేసుకుంది.సార్ సూపర్ హిట్ అవ్వడంతో ఈమె పేరు ఇప్పుడు మార్మోగి పోతుంది.
ప్రజెంట్ కుర్ర హీరోలతో పాటూ, స్టార్ హీరోలకు కూడా మంచి ఛాయిస్ లా మారింది.ఇదిలా ఉండగా ఈమె ప్రస్తుతం మెగా హీరో సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష ( Virupaksha) సినిమాలో నటిస్తుంది.

ఈ సినిమా నేచురల్ థ్రిల్లర్ గా మేకర్స్ తెరకెక్కించారు.మరి ఈ సినిమాలో సాయి తేజ్ ( Sai Dharam Tej ) కు జోడీగా సంయుక్త మీనన్ (Samyukta Menon) హీరోయిన్ గా నటించింది. సుకుమార్ (Sukumar) శిష్యుడు కార్తీక్ దండు ( Karthik Dandu ) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను డైరెక్టర్ సుకుమార్, బివిఎస్ఎన్ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు.ఏప్రిల్ 21న ఈ సినిమా గ్రాండ్ గా పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ కానుంది.

అయితే ఈమె విరూపాక్ష టీమ్ పై తాజాగా సీరియస్ అయ్యింది.ఈ సినిమా మేకర్స్ పై సోషల్ మీడియా వేదికగా అసంతృప్తి వ్యక్తం చేస్తూ పోస్ట్ చేసింది.నిన్న ఉగాది పండుగ సందర్భంగా ఈ సినిమా నుండి తన క్యారెక్టర్ కు సంబంధించిన పోస్టర్ వస్తుంది అని భావించాను.కానీ రాలేదని.చాలా డిజప్పాయింట్ అయ్యానని పోస్ట్ చేయగా.ఇందుకు మేకర్స్ ఈమెకు క్షమాపణలు చెబుతూ కొద్దిగా టైం ఇవ్వండి తప్పకుండ పోస్టర్ రిలీజ్ ఉంటుందని రిప్లై ఇచ్చారు.
అయితే ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అని కొంతమంది కామెంట్స్ చేయడం కొసమెరుపు.







