మహేష్ బాబు నిజం ఫ్లాప్ కావడానికి కారణమేంటో మీకు తెలుసా?

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తేజ డైరెక్షన్ లో తెరకెక్కిన నిజం సినిమా 2003 సంవత్సరంలో విడుదలై ఫ్లాప్ రిజల్ట్ ను అందుకుంది.

తాళ్లూరి రామేశ్వరి, గోపీచంద్, రాశి, ప్రకాష్ రాజ్, రక్షిత ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.

ఇప్పుడు ఈ సినిమాను చూసే చాలామంది ప్రేక్షకులు ఈ సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందో అర్థం కావడం లేదని అభిప్రాయపడుతున్నారు.భారీ అంచనాలతో తెరకెక్కిన నిజం సినిమాకు రిలీజ్ కు ముందు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరిగింది.

కేవలం 7 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు ఫస్ట్ డే కలెక్షన్లు సైతం భారీగానే వచ్చాయి.నిజం సినిమాకు ముందు తేజ దర్శకత్వంలో వచ్చిన సినిమాలలో సంబరం మినహా మిగిలిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు కావడంతో నిజం సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.

అయితే సినిమా చూసిన ప్రేక్షకులు పెదవి విరిచారు. మహేష్ బాబు పాత్ర చిత్రణ సరిగ్గా లేదని మెజారిటీ ప్రేక్షకులు భావించారు.

Reasons Behind Mahesh Babu Nijam Movie Flop Talk, Mahesh Bau , Nijam Movie, Abou
Advertisement
Reasons Behind Mahesh Babu Nijam Movie Flop Talk, Mahesh Bau , Nijam Movie, Abou

తల్లి సహకారంతో మాత్రమే హీరో అన్ని పనులు చేస్తుండటం, కథ, కథనంలోని లోపాలు, ప్రకాష్ రాజ్ పాత్రకు అతిగా ప్రాధాన్యత ఉండటం, ఇతర కారణాల వల్ల సినిమా ఫ్లాప్ రిజల్ట్ ను అందుకుంది.రాశి పాత్ర కూడా సినిమాకు మైనస్ అయింది.ఆర్పీ పట్నాయక్ సినిమాలోని అన్ని పాటలను పాడగా ఆయన వాయిస్ మహేష్ కు సూట్ కాలేదనే కామెంట్లు సైతం వినిపించాయి.

అంచనాలు భారీగా ఉండటం వల్ల కూడా నిజం అనుకున్న స్థాయిలో సక్సెస్ సాధించలేదు.

Reasons Behind Mahesh Babu Nijam Movie Flop Talk, Mahesh Bau , Nijam Movie, Abou

అయితే ఈ సినిమాలోని నటనకు మహేష్ బాబుకు, తాళ్లూరి రామేశ్వరికి అవార్డులు వచ్చాయి.ఒక్కడు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన మహేష్ బాబుకు నిజం సినిమా ఫలితం తీవ్రస్థాయిలో నిరాశపరిచింది.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!
Advertisement

తాజా వార్తలు