మంచు హీరోల సినిమాలకు కలెక్షన్లు రాకపోవడానికి అసలు కారణాలివే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీకి ప్రత్యేక గుర్తింపు ఉంది.మంచు మోహన్ బాబు నటించిన సినిమాలలో ఎన్నో సినిమాలు సంచలన విజయం సాధించాయి.

 Reasons Behind Less Collections For Ginna Movie Details Hee Goes Viral , Ginna-TeluguStop.com

అయితే ఈ మధ్య కాలంలో మంచు హీరోలకు వరుస షాకులు తగులుతున్నాయి.గతేడాది విష్ణు నటించి విడుదలైన మోసగాళ్లు సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కినా కమర్షియల్ గా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించకపోవడం గమనార్హం.

ఈ సినిమా ఫుల్ రన్ లో కేవలం 2 కోట్ల రూపాయలకు అటూఇటుగా కలెక్షన్లను సొంతం చేసుకుంది.కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించినా ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు.

ఆ తర్వాత మంచు విష్ణు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షునిగా పోటీ చేసిన సంగతి తెలిసిందే.ఆ సమయంలో విష్ణుకు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఆ వైరల్ అయిన వీడియోల వల్లే మంచు ఫ్యామిలీపై కొంతమందిలో నెగిటివిటీ ఏర్పడింది.మంచు విష్ణు, అతని కుటుంబం టార్గెట్ గా సోషల్ మీడియాలో ట్రోల్స్ వచ్చాయి.

సన్నాఫ్ ఇండియా సినిమా రిలీజ్ సమయంలో ఈ ట్రోల్స్ మరింత ఎక్కువయ్యాయి.జిన్నా సినిమా సమయంలో ఈ ట్రోలింగ్ ఎక్కువగా లేకపోయినా సినిమాకు కలెక్షన్లు మాత్రం చెప్పుకోదగ్గ స్థాయిలో రాలేదు.

నిన్న విడుదలైన సినిమాల్లో అతి తక్కువ కలెక్షన్లు సాధించిన సినిమా ఇదే కావడం గమనార్హం.

Telugu Ginna, Kajal Aggarwal, Manchu Heroes, Mosagallu, Tollywood-Movie

జిన్నా సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందో లేదో చూడాల్సి ఉంది.జిన్నా సినిమా కలెక్షన్ల గురించి మంచు విష్ణు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.మంచు విష్ణు కెరీర్ విషయంలో మరింత జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉందని కొంతమంది సూచనలు చేస్తున్నారు.

మంచు విష్ణు తర్వాత ప్రాజెక్ట్ లకు గురించి స్పష్టత రావాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube