Mahesh Babu Krishna : ఆ సమస్య వల్లే కృష్ణకు గుండెపోటు వచ్చిందా.. అసలేం జరిగిందంటే?

సీనియర్ స్టార్ హీరోలలో ఒకరైన కృష్ణ అస్వస్థతకు గురి కావడంతో ఆయన త్వరగా కోలుకోవాలని ఘట్టమనేని అభిమానులు కోరుకుంటున్నారు.ప్రస్తుతం కృష్ణ వెంటిలేటర్ పై ఉన్నారు.

 Reasons Behind Krishna Health Issues Details Here Goes Viral ,  Health Issues ,-TeluguStop.com

గుండెపోటుతో నిన్న రాత్రి కృష్ణ ఆస్పత్రిలో చేరారని వైద్యులు వెల్లడించారు.అయితే కృష్ణకు గుండెపోటు రావడానికి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్య కారణమని సమాచారం అందుతోంది.

కొన్నేళ్ల క్రితం కృష్ణ ఒక దీర్ఘకాలిక ఆరోగ్య సమస్య బారిన పడ్డారు.

ఆ సమయంలో వైద్యులను సంప్రదించి థెరపీలు చేయించుకోవడం ద్వారా సమస్య నుంచి ఉపశమనం లభించింది.

అయితే ఇందిరా దేవి మరణం తర్వాత కృష్ణ ఒత్తిడి గురవ్వడంతో ఆయన ఆరోగ్యంపై ప్రభావం పడిందని సమాచారం అందుతోంది.ఆ తర్వాత గతంలో వేధించిన సమస్య తిరగబెట్టిందని అందువల్లే కృష్ణకు గుండెపోటు వచ్చిందని బోగట్టా.

కృష్ణ ఆరోగ్యం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు.

ఈ మధ్య కాలంలో కృష్ణ కుటుంబంలో వరుస విషాదాలు చోటు చేసుకున్నాయి.ఆస్పత్రిలో చేరే సమయానికి కృష్ణ స్పృహలో లేరని తెలుస్తోంది.24 గంటల వరకు కృష్ణ ఆరోగ్యం గురించి ఏమీ చెప్పలేమని వైద్యులు చెబుతున్నారు.రేపు మధ్యాహ్నం మీడియాకు మరో హెల్త్ బులెటిన్ ను రిలీజ్ చేస్తామని వైద్యులు వెల్లడించారు.గత కొంతకాలంగా కృష్ణను శ్వాస సంబంధిత సమస్యలు కూడా వేధిస్తున్నాయి.

Telugu Indira Devi, Bulletin, Heart Attack, Krishna, Mahesh Babu-Movie

సీనియర్ నరేష్ మాత్రం కృష్ణ ఆరోగ్యం నిలకడగానే ఉందని మీడియాకు వెల్లడించారు.మహేష్, కృష్ణ కుటుంబ సభ్యులు ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్నారు.కృష్ణ అభిమానులు కూడా ఆస్పత్రి వద్దకు చేరుకుంటున్నారని సమాచారం అందుతోంది. మహేష్ బాబు ప్రస్తుతం షూటింగ్ లను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారని సమాచారం అందుతోంది.త్రివిక్రమ్ డైరెక్షన్ లో మహేష్ ఒక సినిమాలో నటించాల్సి ఉండగా షూటింగ్ పూర్తి కావడానికి చాలా సమయం పడుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube