సాయి ధరమ్ తేజ్( Sai Dharam Tej ) .మెగా ఫ్యామిలీ లో చాల భిన్నమైన మనస్తత్వం కలిగిన వ్యక్తిగా పేరున్న హీరో.
మెగా కుటుంబ ఆలోచనలను సాయి ధరమ్ తేజ్ నడుచుకునే విధానాలకు చాల తేడా ఉంటుంది.కేవలం సాయి ధరమ్ తేజ్ మాత్రమే కాదు అతడి తమ్ముడు వైష్ణవ తేజ్( Vaishnava Tej ) కూడా అంతే.
మెగా తాలూకు కొన్ని ఛాయలు వీరి దగ్గర ఉండవు.అందుకే మెగా ఫ్యామిలీ న్యూ జెనరేషన్ హీరోలకు లేని పాపులారిటీ పంజా బ్రదర్స్ కి ఉంది.
ఇక సాయి ధరమ్ తేజ్ తల్లి తన తండ్రికి విడాకులు ఇచ్చి మరొక వివాహం చేసుకున్న సంగతి మన అందరికి తెలిసిందే.ఆమె భర్తతో విడిపోయిన చాల రోజులకు డాక్టర్ అయినా శివ ప్రసాద్( Shiva Prasad ) అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నది.

అయితే చాల మందికి తెలియని విషయం ఏమిటి అంటే సాయి ధరమ్ తేజ్ తల్లి విజయ దుర్గ( Vijaya Durga ) అతడి మొదటి భర్త అయినా పంజా ప్రసాద్ నుంచి ఎందుకు విడాకులు తీసుకుంది అని.ఆ వివరాలు ఏంటో ఒకసారి ఇప్పుడు చూద్దాం.పంజా ప్రసాద్ వెస్ట్ గోదావరి లో ఉన్న వీరవాసం మండలంలో పంజా వేమవరం అనే వూరికి సంబందించిన వ్యక్తి కాగా ఆది నుంచి అయన అక్కడ చుట్టూ పక్కల ప్రాంతాల్లో మంచి పలుకుబడి ఉండి, ఆర్థికంగా బాగా ఉన్న కుటుంబానికి చెందిన వాడు.ఆ టైం లో మెగా ఫ్యామిలీ కి అంత పెద్ద ఆర్థిక స్థోమత ఏమి లేదు.
కానీ పంజా ప్రసాద్( Panja Prasad ) మరియు విజయ దుర్గ చాల ఏళ్ళ పాటు బాగానే ఉన్నారు.పిలల్లు పుట్టాక కూడా బాగానే కలిసి ఉన్నారు.
కానీ ఎప్పుడు అయితే హీరో చిరంజీవి ( Chiranjeevi )మెగాస్టార్ గా ఎదిగారో అప్పటి నుంచి మెగా కుటుంబం యొక్క పద్ధతులు మారిపోతూ వచ్చాయి.

అందరు వారి కనుసన్నలలో నడవాలని, ఇంటి అల్లుళ్ళు కూడా తన చుట్టూ భజన చేస్తూ ఉండాలనే విధంగా వారి వ్యవహార శైలి మారుతూ వచ్చింది.కానీ మొదటి నుంచి కొంత అట్టిట్యూడ్ ఉన్న పంజా ప్రసాద్ మెగా ఫామిలీ తో కలవలేక పోయాడు.అదే టైం లో ప్రజారాజ్యం పార్టీ( Praja Rajyam Party ) పెట్టడం కూడా ప్రసాద్ కుటుంబం రాజేకీపరమైన చిచ్చు పెట్టింది.
దాంతో ఇద్దరు విడిపోయారు.కానీ ఇప్పటికి సాయి ధరమ్ తేజ్ మరియు వైష్ణవ తేజ్ తన తండ్రితో మంచి సంబంధాలను కలిగి ఉన్నారు.
మొన్నీ మధ్య పంజా ప్రసాద్ కి గుండె ఆపరేషన్ కూడా దగ్గరుండి చేయించారు.సాయి కి ప్రమాదం జరిగితే ప్రసాద్ హాస్పిటల్ లోనే ఉన్నట్టు సమాచారం.







