రామ్ చరణ్ ''మెరుపు'' సినిమా ఆగిపోవడానికి కారణం అదే!

టాలీవుడ్ ఇండస్ట్రీలో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న హీరోలలో రామ్ చరణ్ ఒకరు.

రామ్ చరణ్ తో సినిమా అంటే వంద కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికైనా నిర్మాత సిద్ధమే.

అయితే అలాంటి రామ్ చరణ్ కెరీర్ లోను ఒక సినిమా మొదలై ఆగిపోయింది.రామ్ చరణ్, కాజల్ జంటగా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కాల్సిన సినిమా ఆగిపోవడం అభిమానులను సైతం తీవ్రంగా నిరాశపరిచింది.

చిరుత, మగధీర సినిమాల విజయాల తరువాత రామ్ చరణ్, బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్లో తెరకెక్కిన ఆరెంజ్ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని చవిచూసింది.ఈ సినిమా డిజాస్టర్ అనంతరం పవన్ తో బంగారం సినిమా తీసిన తమిళ దర్శకుడు ధరణి చెప్పిన కథ నచ్చడంతో రామ్ చరణ్ మెరుపు సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

అప్పటికే మగధీర సినిమాతో హిట్ జోడీ అనిపించుకున్న కాజల్ హీరోయిన్ గా ‘సూపర్ గుడ్ ఫిలిమ్స్’ అధినేత ఆర్.బి.చౌదరి నిర్మాత గా షూటింగ్ మొదలైంది.

Reason Behind Ram Charan Merupu Shooting Halted, Merupu, Ram Charan, Kajal Aggar
Advertisement
Reason Behind Ram Charan Merupu Shooting Halted, Merupu, Ram Charan, Kajal Aggar

రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ను ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా ఫైనలైజ్ చేశారు.15 రోజుల షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం తొలి షెడ్యూల్ కే 10 కోట్ల రూపాయలు ఖర్చు కావడంతో నిర్మాతలు షూటింగ్ మధ్యలోనే ఆపేశారు.ఈ ప్రాజెక్ట్ పూర్తి చేస్తే సినిమా హిట్టైనా నష్టాలు తప్పవని భావించి నిర్మాత, చరణ్, దర్శకుడు ధరణికి నచ్చజెప్పి ప్రాజెక్ట్ ఆపేశారు.

ఆ తరువాత సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ పైనే చరణ్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో రచ్చ సినిమా తెరకెక్కి బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

Advertisement

తాజా వార్తలు