మహేష్ బాబు అనిమల్ ఫంక్షన్ కి రావడానికి కారణం ఏంటో తెలుసా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటులు వాళ్ళకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూ తమదైన రీతిలో సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తుంటారు.ఇక ఇలాంటి క్రమంలోనే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ( Sandeep Reddy Vanga ) చేసిన అనిమల్ సినిమా( Animal Movie ) సక్సెస్ ఫుల్ సినిమాగా గుర్తింపు పొందడానికి ఆయన భారీ ఎత్తున ప్రమోషన్స్ ని కూడా చేస్తున్నాడు ఇక ఇప్పటికే ఈ సినిమాకి రావాల్సినంత క్రేజ్ అయితే వచ్చింది.

 Reason Behind Mahesh Babu Attended Animal Movie Pre Release Event Details, Mahes-TeluguStop.com

ఇక డిసెంబర్ ఒకటోవ తేదీన ఈ సినిమాని థియేటర్లో చూసిన ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారనే దానిపైన ప్రస్తుతం ఈ సినిమా భవిష్యత్ అనేది ఆధారపడి ఉంది.

ఇక నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో మహేష్ బాబు, రాజమౌళి, మంత్రి మల్లారెడ్డి లాంటి ప్రముఖులు ఈ ఫంక్షన్ కి చీఫ్ గెస్టులు గా రావడం జరిగింది…ఇక ఇప్పుడు మహేష్ బాబు ఈ సినిమా ఫంక్షన్ కి రావడం పట్ల సినీ ప్రముఖులు సైతం మహేష్ బాబు( Mahesh Babu ) తన నెక్స్ట్ సినిమాని సందీప్ రెడ్డి వంగతో చేయడానికి ఫిక్స్ అయినట్టుగా తెలుస్తుంది.ఇప్పటికే తనకు సందీప్ ఒక కథ చెప్పినప్పటికీ అది మహేష్ కి నచ్చకపోవడంతో మహేష్ బాబు ఆ స్టోరీ ని రిజెక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది.

 Reason Behind Mahesh Babu Attended Animal Movie Pre Release Event Details, Mahes-TeluguStop.com

ఇక దాంతో ఇప్పుడైనా సందీప్ తో సినిమా చేస్తే తనకు కెరీయర్ పరంగా మంచి బూస్టప్ వస్తుందనే ఆలోచనలో ఉన్నాడు.ఇక రాజమౌళి( Rajamouli ) సినిమా తర్వాత మహేష్ బాబు ఆల్మోస్ట్ సందీప్ తో సినిమా చేసే అవకాశాలు అయితే ఉన్నాయి…ఇక ఆ లోపు సందీప్ ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమాని కూడా కంప్లీట్ చేస్తాడు…ఇక వీళ్ళ కాంబో లో సినిమా వస్తే ఆ సినిమా పక్క బ్లాక్ బస్టర్ అంటూ ఇప్పటికే అభిమానుల నుంచి చాలా కామెంట్లు వస్తున్నాయి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube