RC15 సెట్స్ లో చరణ్ బర్త్ డే సెలెబ్రేషన్స్.. పిక్స్ వైరల్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan )మొన్నటి వరకు ఆస్కార్ ఫీవర్ లోనే మునిగి పోయారు.

ఈయన నటించిన ట్రిపుల్ సినిమాలో నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ అవార్డు రావడంతో దీనిని బాగా సెలెబ్రేట్ చేసుకున్నారు.

ఇక ఈ అవార్డుతో రామ్ చరణ్ కు గ్లోబల్ వైడ్ గా మరింత పేరు వచ్చింది అనే చెప్పాలి.మరి ఆస్కార్ సెలెబ్రేషన్స్ ను ఇప్పుడిప్పుడే బయటపడుతున్న చరణ్ కు మళ్ళీ బర్త్ డే సెలెబ్రేషన్స్ పలకరిస్తున్నాయి.

రేపు మార్చి 27న రామ్ చరణ్ తేజ్ పుట్టిన రోజు( Ram Charan birthday ) జరుపుకోనున్నారు.ఈ క్రమంలోనే మెగా ఫ్యాన్స్ అయితే ముందుగానే సోషల్ మీడియాలో సెలెబ్రేషన్స్ స్టార్ట్ చేసారు.

ఇక ఈయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ RC15 సెట్స్ లో కూడా రెండు రోజులు ముందుగానే సెలెబ్రేషన్స్ చేసారు.మార్చి 27న పుట్టిన రోజు కావడంతో నిన్న రాత్రినే టీమ్ అంతా ఘనంగా ఆయన బర్త్ డే ను సెలెబ్రేట్ చేసారు.

Rc15 Team Celebrates Ram Charans Birthday On The Sets In Advance
Advertisement
Rc15 Team Celebrates Ram Charans Birthday On The Sets In Advance-RC15 సెట

ఈ క్రమంలోనే టీమ్ అంతా చరణ్ బర్త్ డే సెలెబ్రేషన్స్ లో చేసిన సందడిని కొద్దీ సేపటి క్రితం నిర్మాణ సంస్థ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అవి వెంటనే వైరల్ అయ్యాయి.అలాగే ఈ పోస్ట్ లో పిక్స్ షేర్ చేస్తూ నేటితో ఒక బ్యూటిఫుల్ సాంగ్ షూట్ పూర్తి అయిందని.అలానే త్వరలో ఈ సినిమా నుండి మరిన్ని అప్ డేట్స్ వస్తాయి ఐ వెయిట్ చేయమని పోస్ట్ చేయడంతో బర్త్ డే రోజు ఏదైనా బ్లాస్ట్ ప్లాన్ చేశారేమో అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

Rc15 Team Celebrates Ram Charans Birthday On The Sets In Advance

ఇక RC15 సినిమాను శంకర్( Shankar ) డైరెక్ట్ చేస్తుండగా. కియారా అద్వానీ(Kiara Advani ) హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్ తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టు తెలుస్తుంది.చూడాలి ఈ సినిమాతో ట్రిపుల్ ఆర్ విజయాన్ని కంటిన్యూ చేస్తాడో లేదో.

న్యూస్ రౌండప్ టాప్ 20
Advertisement

తాజా వార్తలు