ఎన్ఆర్ఐలకు ఆర్‌బీఐ గుడ్‌న్యూస్ .. ఆ డిపాజిట్లపై వడ్డీ పెంపు, ఎంతంటే?

వృత్తి , ఉద్యోగ, వ్యాపారాల కోసం విదేశాలకు వెళ్లిన ప్రవాస భారతీయులు( NRI’s ) మాతృభూమికి ఎంతో సేవ చేస్తున్నారు.స్వదేశంలో ఎన్నో సామాజిక కార్యక్రమాలతో పాటు కంపెనీలు స్థాపించి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారు.

 Rbi Hikes Interest Rates On Nri Foreign Currency Deposits Details, Rbi ,hikes In-TeluguStop.com

అంతేకాదు.విదేశాలలో ఉన్న ప్రవాస భారతీయుల వల్ల దేశానికి ప్రతియేటా వేల కోట్ల విదేశీ మారక ద్రవ్యం సమకూరుతోంది.

ఈ రకంగా ఆర్ధిక వ్యవస్ధకు కూడా ప్రవాస భారతీయులు ఎంతో సాయం చేస్తున్నారు.

ఇదిలాఉండగా.

ప్రవాస భారతీయులకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ)( Reserve Bank Of India ) శుభవార్త చెప్పింది.ఎన్ఆర్ఐలు చేసే విదేశీ కరెన్సీపై డిపాజిట్లపై వడ్డీ రేట్ల( Interest Rates ) పరిమితిని పెంచుతున్నట్లు తెలిపింది.

రూపాయి ఒత్తిడికి ప్రతిస్పందనగా మూలధన ప్రవాహాన్ని పెంచడం దీని వెనుక ఉన్న లక్ష్యం.డాలర్‌తో పోల్చితే రూపాయి కనిష్ట స్థాయికి చేరిన తరుణంలో రిజర్వ్ బ్యాంక్ ఈ చర్య తీసుకుంది.ఈ వారం అమెరికన్ డాలర్‌తో రూపాయి మారకం విలువ రికార్డు స్థాయిలో రూ.84.75కి చేరుకుంది.

Telugu Fcnr Deposits, Foreigncurrency, Interest Rates, Indian Rupee, Nri Deposit

ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి గాను ఐదవ క్రెడిట్ పాలసీకి సంబంధించి ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్( RBI Governor Shaktikanta Das ) కీలక ప్రకటన చేశారు.దీని ప్రకారం ఎఫ్‌సీఎన్ఆర్ (బీ) డిపాజిట్లు అని పిలవబడే విదేశీ కరెన్సీ బ్యాంక్ డిపాజిట్లపై వడ్డీ రేటు పరిమితిని పెంచుతున్నట్లు తెలిపారు.రూపాయి మారకంలో హెచ్చుతగ్గులను నియంత్రించేందుకు రిజర్వ్ బ్యాంక్ .విదేశీ మారక ద్రవ్య నిల్వలను వినియోగిస్తున్నట్లుగా కనిపిస్తోంది.ఈ క్రమంలోనే ప్రవాస భారతీయులు చేసే విదేశీ కరెన్సీ డిపాజిట్లపై వడ్డీ రేటును పెంచాలని నిర్ణయించింది.

Telugu Fcnr Deposits, Foreigncurrency, Interest Rates, Indian Rupee, Nri Deposit

శుక్రవారం నుంచి బ్యాంకులు కొత్త ఎఫ్‌సీఎన్ఆర్ (బీ) డిపాజిట్‌లపై 4 శాతం స్వల్పకాలిక ప్రత్యామ్నాయ సూచన రేటు కింద ఏడాది, మూడేళ్ల వ్యవధితో సేకరించవచ్చు.వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఇది అందుబాటులో ఉంటుందని ఆర్‌బీఐ గవర్నర్ తెలిపారు.ప్రపంచంలోనే అత్యధిక శాతం రెమిటెన్స్‌లను స్వీకరించే భారతదేశం.రూపాయిపై ఒత్తిడి మధ్య ఇటీవల ఎన్ఆర్ఐ డిపాజిట్‌లపై మెరుగైన వడ్డీ రేట్లను అందించింది.వర్ధమాన మార్కెట్‌లతో పోలిస్తే భారత్‌లో అస్థిరత తక్కువగానే ఉందని శక్తికాంత దాస్ అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube