' కన్నా ' పై కోపం ! వైసీపీలోకి రాయపాటి ? 

ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో పార్టీ మారేవారి సంఖ్య పెరుగుతోంది .

ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి జంపింగ్ లు సర్వసాధారణంగా మారిపోయాయి .

కొద్దిరోజుల క్రితమే వైసిపి నుంచి జనసేన లో కొంతమంది నేతలు చేరగా, మరి కొంతమంది చేరేందుకు సిద్ధమవుతున్నారు.వైసిపి నుంచి టిడిపిలోకి కొన్ని వలసలు చోటు చేసుకోగా, ఇప్పుడు టిడిపిలో కీలక నేతగా ఉన్న మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు( Rayapati sambasivarao) పార్టీ మారే ఆలోచనతో ఉన్నారు.

టిడిపిలో తనకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదనే అసంతృప్తితో ఉన్నారు.తనకు ప్రత్యర్థిగా ఉంటూ వచ్చిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ను టిడిపిలో చేర్చుకున్న దగ్గర నుంచి రాయపాటి అసంతృప్తితోనే ఉంటున్నారు.

కన్నా లక్ష్మీనారాయణ టిడిపిలో చేరిన దగ్గర నుంచి ఆయనకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారనే అభిప్రాయంతో రాయపాటి సాంబశివరావు అసంతృప్తితో ఉంటున్నారు .

Advertisement

కన్నా లక్ష్మీనారాయణ( Kanna Lakshminarayana ) టిడిపిలో రావడానికి ఆయన మొదటి నుంచి వ్యతిరేకిస్తూనే వచ్చారు.వచ్చే ఎన్నికల్లో తమకు ఇవ్వాల్సిన సీట్లు,  తమకు కేటాయించాల్సిందేనని ప్రతిపాదనను పెట్టారు.అయితే కన్నాకు సత్తెనపల్లి అసెంబ్లీ టికెట్లు చద్రబాబు ఖరారు చేయడం , రాయపాటి ఫ్యామిలీకి సీట్లు ఖరారు చేయకపోగా, సరైన హామీ కూడా ఇవ్వకపోవడం వంటివి రాయపాటిలో అసంతృప్తి కలిగిస్తున్నాయి.

అంతేకాకుండా రాయపాటి ఫ్యామిలీకి ఒకే ఒక్క సీటు ఇవ్వాలని చంద్రబాబు భావిస్తుండడంతో ఆయన మరింత అసంతృప్తితో ఉన్నారట.

 ఆసంతృప్తితో పాటు కన్నాకు టిడిపిలో ఎక్కువ ప్రాధాన్యం దక్కడం,  రానున్న రోజుల్లోనూ తన ప్రభావం టిడిపిలో పెద్దగా ఉండే అవకాశం లేకపోవడం తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.ఈ మేరకు వైసిపి నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ రంగంలోకి దిగి రాయపాటిని వైసీపీలో తీసుకువచ్చే బాధ్యతలు తీసుకున్నారట .ఈ మేరకు వైసిపి అధిష్టానంతోనూ ఈ విషయం పై చర్చించినట్లు తెలుస్తోంది.మరికొద్ది రోజుల్లోనే రాయపాటి వైసిపిలో చేరే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది .అయితే ఈ వ్యవహారాలపై రాయపాటి మాత్రం బహిరంగంగా స్పందించడం లేదు.

ఎంత ప్రయత్నించినా జుట్టు రాలడం ఆగట్లేదా.. అయితే మీరు ఇది ట్రై చేయాల్సిందే!
Advertisement

తాజా వార్తలు