టీడీపీకి రాయపాటి రంగారావు రాజీనామా..!!

ఏపీలో ఎన్నికలు( AP Elections ) దగ్గర పడే కొలది రాజీనామాల పర్వం కొనసాగుతోంది.ఇదే సమయంలో ఒక పార్టీ నుండి మరొక పార్టీకి జాయిన్ అయ్యే నాయకుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది.

 Rayapati Ranga Rao Resigns From Tdp, Ysrcp, Rayapati Ranga Rao, Tdp,ap Politics,-TeluguStop.com

మొన్ననే విజయవాడ ఎంపీ కేశినేని నాని తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు.వైసీపీ అధినేత సీఎం జగన్( YS Jagan ) ని కూడా కలవడం జరిగింది.

ఆ సమయంలో మీడియా సమావేశం నిర్వహించి త్వరలోనే వైసీపీ పార్టీలో అధికారికంగా జాయిన్ అవుతానని స్పష్టం చేశారు.అంతకుముందు వైసీపీ పార్టీలో జాయిన్ అయిన ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు.

వైసీపీకి రాజీనామా చేసి.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని కలవడం జరిగింది.

ఇదిలా ఉంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తనయుడు రాయపాటి రంగారావు( Rayapati Rangarao ) పార్టీకి రాజీనామా చేయడం జరిగింది.
స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పోస్టుతో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు రంగారావు చంద్రబాబుకు లేఖ రాశారు.

లేఖలో ప్రస్తుత పరిస్థితులలో పార్టీలో పని చేయలేనని పేర్కొన్నారు.తన నిర్ణయాన్ని గౌరవించాలని కూడా విజ్ఞప్తి చేశారు.గుంటూరు జిల్లాలో రాయపాటి ఫ్యామిలీకి మంచి బలం ఉంది.తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా రాయపాటి సాంబశివరావు రాణిస్తున్నారు.2019 ఎన్నికల సమయంలో రాయపాటి సాంబశివరావు( Rayapati Sambasivarao ) ఓటమిపాలయ్యారు.అనంతరం ఆయన కొడుకు రాయపాటి రంగారావు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా రాణిస్తున్నారు.

ఈ క్రమంలో రాయపాటి రంగారావు రాజీనామా చేయటం ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube