రవితేజ( Ravi Teja ) ఒక్క సినిమా సక్సెస్ అయితే రెండు మూడు సినిమాలు ఫ్లాప్ అన్నట్లుగా పరిస్థితి ఉంది.క్రాక్ సినిమా సక్సెస్ అయిన తర్వాత వరుసగా ఫ్లాప్స్ చవి చూసినా రవితేజ మళ్ళీ ధమాకా సినిమాతో సక్సెస్ ని సొంతం చేసుకున్నాడు.
ధమాకా ( Dhamaka )సక్సెస్ సంతోషం నుండి బయట పడక ముందే రావణాసుర సినిమా ఫ్లాప్ అయ్యింది.రావణాసుర సినిమా( Ravanasura movie ) యొక్క ఫలితం విషయంలో రవితేజ తీవ్రంగా నిరుత్సాహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.
ఆ సినిమా కోసం రవితేజ కాస్త ఎక్కువగానే కష్టపడ్డాడట.అయితే ప్రమోషన్ కార్యక్రమాల విషయంలో రవితేజ కాస్త అశ్రద్ధ చూపించాడు అనేది కొందరి మాట.అందుకే రవితేజ తన తదుపరి సినిమా టైగర్ నాగేశ్వరరావు( Tiger Nageswara Rao ) విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నట్లుగా సమాచారం అందుతుంది.విశ్వసనీయంగా అందుకున్న సమాచారం ప్రకారం టైగర్ నాగేశ్వరరావు సినిమా విడుదల నెల రోజులు ఉండగానే పబ్లిసిటీ కార్యక్రమాలు పీక్స్ లో ఉండబోతున్నాయట.
టైగర్ నాగేశ్వరరావు సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాలకు గాను పలువురు స్టార్స్ ని కూడా ఆహ్వానించేందుకు రవితేజ ప్లాన్ చేస్తున్నాడు.

సాధారణంగా రవితేజ సినిమాలకు పెద్దగా ఇతర స్టార్స్ గెస్ట్ లుగా కనిపించరు.కానీ టైగర్ నాగేశ్వరరావు మాత్రం తన పద్ధతిని పక్కకు పెట్టాలని నిర్ణయించుకున్నాడు.సినిమా షూటింగ్ కార్యక్రమాలు ముగింపు దశకు చేరుకున్నాయి.
అక్టోబర్ నెలలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.జులై లేదా ఆగస్టు వరకు సినిమా షూటింగ్ పూర్తి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

సెప్టెంబర్ నెల మొదలుకొని విడుదల అయ్యే వరకు ప్రమోషన్ కార్యక్రమాల కోసం రవితేజ ఎక్కువ సమయం కేటాయించాలని భావిస్తున్నాడట.రావణాసుర సినిమాకు జరిగిన తప్పిదం మళ్లీ జరగకుండా ప్రమోషన్ కార్యక్రమాల కోసం రవితేజ ఎక్కువ సమయాన్ని కేటాయించడం మంచిదే అంటూ అభిమానులు అభిప్రాయం అర్థం చేస్తున్నారు.కంటెంట్ ఉంటే పబ్లిసిటీతో పనిలేదు అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటారు.రవితేజ టైగర్ నాగేశ్వరరావు కంటెంట్ తో పాటు సాలిడ్ పబ్లిసిటీ చేస్తే కచ్చితంగా మరో 100 కోట్ల సినిమా రవితేజ ఖాతాలో పట్టట్లే అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.







