రవితేజ 'రావణాసుర' ఎలా ఉండబోతుందంటే!

మాస్ మహారాజా రవితేజ ( Ravi Teja )హీరోగా నటించి రావణాసుర( Ravanasura) మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.

ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం అయినప్పటి నుండి కూడా టైటిల్‌ విషయం లో మరియు రవితేజ పాత్ర విషయం లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

ట్రైలర్ విడుదల తర్వాత మరియు పోస్టర్స్ విడుదల తర్వాత సినిమా స్థాయి అమాంతం పెరిగింది అనడం లో సందేహం లేదు.రవితేజ కు జోడి గా ఈ సినిమా లో నలుగురు హీరోయిన్స్ నటించారు.

రవితేజ నెగిటివ్ షేడ్స్‌ ఉన్న పాత్ర లో కనిపించబోతున్నాడు అనే ప్రచారం కూడా జరుగుతుంది.మొత్తానికి ఈ సినిమా లో రవితేజ యొక్క లుక్ మరియు ఇతర విషయాలు చాలా ఆసక్తిని కలిగిస్తున్నాయి.

రావణాసుర చిత్రం లో రవితేజ పాత్ర తో పాటు అన్ని విషయాల్లో కూడా సస్పెన్షన్ నెలకొంది.ఇక హీరో హీరోయిన్స్ మధ్య ఉండే రొమాన్స్ ఇతర విషయాలు అన్ని రకరకాలుగా మీడియా వర్గాల్లో మరియు ప్రేక్షకుల్లో ప్రచారం జరుగుతుంది.

Advertisement

అసలు విషయం ఏంటి అనేది రేపు సినిమా విడుదల అయితే కానీ క్లారిటీ వచ్చే అవకాశం లేదు.ధమాకా చిత్రం తర్వాత రవితేజ నుండి రాబోతున్న సినిమా అవ్వడం వల్ల అంచనాలను ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.గత చిత్రం రూ.100 కోట్ల కలెక్షన్స్ నమోదు చేసిన నేపథ్యం లో ఈ సినిమా కూడా కచ్చితంగా రూ.100 కోట్ల సినిమా గా నిలుస్తుందని అభిప్రాయం వ్యక్తం అవుతోంది.ఈ సినిమా లో అక్కినేని హీరో సుశాంత్ ( Sushant )కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.

జాతిరత్నాలు ముద్దుగుమ్మ ఫరియా అబ్దుల్లా ఒక హీరోయిన్ గా నటిస్తోంది.మొత్తానికి ఈ సినిమా నిండా భారీ తారాగణం కనిపించబోతున్న నేపథ్యం లో అంచనాలు భారీగా ఉన్నాయి.

మరి అంచనాలకు తగ్గట్టుగా ఈ సినిమా ఉందా లేదా అనేది తెలియాలంటే మరికొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే.

ఏకంగా హీరోనే డామినేట్ చేసిన టాలెంటెడ్ యాక్టర్స్.. ఎవరంటే..? 
Advertisement

తాజా వార్తలు