Raviteja, Puri Jagannadh: ఆ స్టార్ హీరోయిన్ కాళ్లు మొక్కిన రవితేజ, పూరి జగన్నాథ్.. కారణం..?

ఏంటి స్టార్ హీరో అయిన మాస్ మహారాజా రవితేజ,స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ( Raviteja, Puri Jagannadh ) ఆ హీరోయిన్ కాళ్ళు మొక్కుతారా.అయితే ఆ హీరోయిన్ వీళ్ళకంటే సీనియర్ కూడా కాదు.

 Raviteja Puri Jagannadh Who Planted The Legs Of That Star Heroine The Reason-TeluguStop.com

వీరికంటే చిన్నదే అయితే అలాంటి ఆ హీరోయిన్ కాళ్లు ఈ ఇద్దరూ స్టార్స్ ఎందుకు కాళ్ళు మొక్కుతారు అనేది చాలామందికి అర్థం అవ్వడం లేదు.అయితే పూరి జగన్నాథ్, రవితేజ ఇద్దరు కాళ్ళు మొక్కే ఆ హీరోయిన్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని అనుష్క ( Anushka ) గురించి సంచలన కామెంట్లు చేశారు.చాలామందికి అనుష్క అంటే కొద్ది వరకు మాత్రమే తెలుసు.

కానీ ఆమె వ్యక్తిత్వం చాలా మంచిదట.

ఇక ఈ విషయాన్ని స్వయంగా పూరి జగన్నాథ్ ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు.

ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.హీరోయిన్ అనుష్కని చాలామంది ఇండస్ట్రీలో ఉన్నవాళ్లు మంచిది అంటుంటారు.

కానీ ఆమె ఎంత మంచిదో దగ్గరగా ఉండి ఆమె వ్యక్తిత్వాన్ని చూస్తేనే అర్థమవుతుంది.ఇక మేం ఆమెను ఎంతలా గౌరవిస్తామంటే నేను, చార్మి( Charmi ) ,రవితేజ ఆమె కనిపించినప్పుడల్లా ఆమె కాళ్ళకి దండం పెట్టి ఆమె ఆశీర్వాదాలు తీసుకుంటాం.

Telugu Anushka Shetty, Charmi Kaur, Puri Jagannadh, Raviteja-Movie

అంతలా అనుష్క అంటే గౌరవం మాకు.అంతేకాదు ఆమెను మేము పేరు పెట్టి కాకుండా అమ్మా,అమ్మా అని పిలుస్తాం.ఇక మేము ముగ్గురం ఆమె కాళ్ళకి దండం పెట్టడానికి ప్రధాన కారణం అనుష్క లో ఉన్న కొన్ని గుణగణాలు అయినా మాకు రావాలి అని మా ఉద్దేశం.అందుకే ప్రతిసారి అలా చేస్తాం అంటూ పూరి జగన్నాద్ చెప్పుకొచ్చారు.

Telugu Anushka Shetty, Charmi Kaur, Puri Jagannadh, Raviteja-Movie

అయితే ఆ ఇంటర్వ్యూలో మాట్లాడిన దానికి సంబందించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొట్టడంతో నటి అనుష్కని స్టార్ హీరో డైరెక్టర్ హీరోయిన్ అయినా వీళ్ళు ముగ్గురు అమ్మలా చూస్తారా.అంతే కాదు ఆమె కాళ్లు కూడా మొక్కుతారు అంటే అనుష్క క్యారెక్టర్ ఎంత మంచిదో అర్థం చేసుకోవచ్చు అంటూ ఆమె అభిమానులు సంబరపడిపోతున్నారు.ఇక ఈ మధ్యనే అనుష్క మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ( Miss Shetty Mr.Polishetty ) అనే సినిమాతో హిట్ కొట్టింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube