'సలార్' మేనియా ని తట్టుకొని అదరగొడుతున్న రవితేజ 'వెంకీ' రీ రిలీజ్ అడ్వాన్స్ బుకింగ్స్!

ఒకానొక దశలో మన టాలీవుడ్ కి కొత్త సినిమాలు విడుదల లేని సమయం లో రీ రిలీజ్ సినిమాలు థియేటర్స్ కి మంచి ఫీడింగ్ ఇచ్చాయి.ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మరియు మహేష్ బాబు పాత సినిమాలను 4K కి మార్చి రీ రిలీజ్ చేస్తే జనాలు ఎగబడి చూసారు.

 Ravi Teja's Venky ' Re-release Advance Bookings, Which Is Supporting 'salaar' M-TeluguStop.com

వీళ్లిద్దరి సినిమాలు అలా చూసారని మరికొంతమంది హీరోలకు సంబంధించిన పాత సినిమాలను రీ రిలీజ్ చెయ్యగా, కొన్ని సక్సెస్ అయ్యాయి, కొన్ని సక్సెస్ కాలేదు.రీసెంట్ గా జూనియర్ ఎన్టీఆర్ హీరో గా నటించిన ఆల్ టైం క్లాసిక్ బ్లాక్ బస్టర్ అదుర్స్ ని 4K కి మార్చి గ్రాండ్ గా రీ రిలీజ్ చేసారు.

ఈ సినిమాకి కనీస స్థాయి రెస్పాన్స్ కూడా రాలేదు.దీంతో ఇక రీ రిలీజ్ ట్రెండ్ ముగిసిపోయింది అని అందరూ అనుకున్నారు.

కానీ రవితేజ కెరీర్ లో ల్యాండ్ మార్క్ గా నిల్చిన ‘వెంకీ’ సినిమా మాత్రం( Venky movie ) ఆ అంచనాలను తారుమారు చేసింది.

Telugu Salaar, Adhurs, Advance, Prabhas, Ravi Teja, Sneha, Srinivasareddy, Tolly

ఈ చిత్రాన్ని డిసెంబర్ 30 వ తారీఖున విడుదల చెయ్యబోతున్నారు.ఇప్పుడు ‘సలార్’ మేనియా టాలీవుడ్( Salaar ) లో ఒక రేంజ్ లో నడుస్తుంది.ఈ ఊపు లో వెంకీ సినిమాని రీ రిలీజ్ చేస్తే ఎవరు పట్టించుకుంటారు అని అనుకున్నారు అందరూ.

కానీ వెంకీ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించిన నిమిషాల వ్యవధిలోనే టికెట్స్ హాట్ కేక్స్ లాగ అమ్ముడుపోయాయి.హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో నాలుగు థియేటర్స్ లో ఉదయం ఆటలకు సంబంధించిన బుకింగ్స్ ఓపెన్ చేస్తే నిమిషాల వ్యవధిలోనే టికెట్స్ మొత్తం అమ్ముడుపోయాయి.

రవితేజ కొత్త సినిమాలకు కూడా ఎప్పుడూ ఈ రేంజ్ బుకింగ్స్ చూడలేదని , ఇది నిజంగా మమల్ని సర్ప్రైజ్ చేసింది అంటూ ట్రేడ్ పండితులు కామెంట్ చేస్తున్నారు.అదుర్స్ రీ రిలీజ్ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా కలిపి 10 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు కూడా రాలేదు.

Telugu Salaar, Adhurs, Advance, Prabhas, Ravi Teja, Sneha, Srinivasareddy, Tolly

కానీ వెంకీ చిత్రానికి కేవలం ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుండే 10 లక్షలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి.ఇది సాధారమైన విషయం కాదు.అదుర్స్ మరియు వెంకీ( Adhurs ) ఈ రెండు చిత్రాలకు సోషల్ మీడియా వచ్చిన తర్వాత మామూలు రేంజ్ క్రేజ్ ఏర్పడలేదు.అత్యధిక శాతం మీమ్స్ రెండు చిత్రాల నుండే వస్తుంటాయి.

అలాంటిది వెంకీ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చి, అదుర్స్ కి రెస్పాన్స్ రాలేదు అంటే దాని అర్థం ఎన్టీఆర్ కి కామన్ ఆడియన్స్ లో క్రేజ్ లేదని అంటున్నారు ట్రేడ్ పండితులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube