Vikramarkudu 2 : విక్రమార్కుడు 2 ఆ డైరెక్టర్ తో మాత్రమే చేస్తానంటున్న రవితేజ…ఇంతకీ ఎవరాయన..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు రాజమౌళి( Rajamouli )… ఈయన చేసిన ప్రతి సినిమా ఒక ప్రభంజనాన్ని సృష్టించింది.అయితే ఒకప్పుడు ఈయన రవితేజతో చేసిన విక్రమార్కుడు సినిమా ఒకప్పుడు బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది.

 Ravi Teja Who Says That Vikramarkudu 2 Will Be Done Only With That Director So-TeluguStop.com

ఇక ఇది ఇలా ఉంటే ఇప్పుడు ఆ సినిమాకి సంబంధించిన సీక్వెల్ స్టోరీని రాయడంలో విజయేంద్రప్రసాద్ బిజీగా ఉన్నట్టుగా తెలుస్తుంది.అయితే ఈ సినిమా రైట్స్ ని కేకే రాధ మోహన్ తీసుకున్నారు…

Telugu Rajamouli, Ravi Teja, Sampath Nand, Vikramarkudu-Movie

ఇక ఈ సినిమాకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తొందరలోనే తెలియజేయనున్నారు.అయితే ఈ సినిమాలో హీరోగా రవితేజ( Ravi Teja ) నటిస్తున్నాడు…కానీ రవితేజ హీరోగా చేయాలంటే మాత్రం ఈ సినిమాని రాజమౌళి డైరెక్షన్ చేస్తేనే తను ఈ సినిమా చేస్తానని చెప్తున్నాడట.కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజమౌళి ఈ సినిమాను డైరెక్ట్ చేసే అవకాశం అయితే లేదు.

కాబట్టి ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా సంపత్ నంది( Sampath Nand ) డైరెక్షన్ లో తెరకెక్కనున్నట్టుగా తెలుస్తుంది.మరి ఈ సినిమాతో తన టాలెంట్ ఏంటో నిరూపించుకోవాలని సంపత్ నంది ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఆయన డైరెక్టర్ అయి 15 సంవత్సరాలు అవుతున్న కూడా సంపత్ నంది ఇప్పటివరకు పెద్దగా సక్సెస్ లు అయితే సాధించలేదు.

Telugu Rajamouli, Ravi Teja, Sampath Nand, Vikramarkudu-Movie

కాబట్టి ఈ సినిమాతో భారీ సక్సెస్ ని సాధించాలని చూస్తున్నట్లుగా తెలుస్తుంది.మరి రాజమౌళి ఈ సినిమాని చేయకపోతే రవితేజ ఈ సినిమాని చేసే ప్రసక్తి లేదు అని కరాకండిగా చెబుతున్నప్పుడు మరి ఈ సినిమాలో రవితేజ హీరోగా చేస్తాడా లేదంటే వేరే హీరో ఈ సినిమాని చేస్తాడా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది…ఇక ఈ సినిమా విషయం లో విజయేంద్ర ప్రసాద్ మాత్రం చాలా డెప్త్ తో ఈ కథను రాస్తున్నట్టుగా తెలుస్తుంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube