మెగాస్టార్ చిరంజీవి మునుపెన్నడూ లేని విధంగా కుర్ర హీరోలతో పోటీగా సినిమాలు చేస్తూ ఈ వయసులో కూడా అంతా యాక్టివ్ గా ఉంటూ అందరిని ఆశ్చర్య పరుస్తున్నాడు.చిరంజీవి ప్రెసెంట్ కుర్ర హీరోలు కూడా చేయలేనంత స్పీడ్ గా సినిమాలు చేస్తున్నాడు.
ఈయన ఇది వరకు ఏడాదికి ఒక సినిమా మాత్రమే చేసేవాడు.కానీ ఇప్పుడు అలా కాదు ఒకటి పూర్తి అవ్వకుండానే మరొకటి చేస్తూ ఫుల్ స్పీడ్ గా ఉన్నాడు.
ప్రెసెంట్ చిరంజీవి టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య సినిమాను రిలీజ్ కు రెడీగా ఉంచాడు.ఈ సినిమా ఈ ఏడాది ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది.
ఈ సినిమా రిలీజ్ కాకుండానే వరుస సినిమాలను లైన్లో పెట్టాడు.ఆ సినిమాల్లో బాబీ దర్శకత్వంలో చేసే మెగా 154 కూడా ఉంది.
మెగా 154 ఇప్పటికే పోస్టర్ విడుదల చేసారు.

ఇందులో చిరు సరికొత్త మేకోవర్ తో కనిపించి మెగా అభిమానులకు ఖుషీ చేయనున్నాడు.ఇక ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.‘మెగా 154’ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.అయితే ఇందులో మెగాస్టార్ తో పాటు మాస్ రాజా రవితేజ కూడా నటిస్తున్నాడు.తాజాగా రవితేజ రోల్ గురించి ఒక వార్త నెట్టింట వైరల్ అయ్యింది.రవితేజ పాత్ర మాత్రమే కాదు కొద్దిగా స్టోరీ కూడా లీక్ అయ్యింది.

ఈ సినిమాలో రవితేజ పాత్ర సెకండాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో కనిపిస్తుంది అని చిత్ర వర్గాల్లో తాజాగా టాక్ వస్తుంది.ఈ సినిమాలో చిరు సోదరుడి పాత్రలో రవితేజ నటిస్తుండగా.ఈయన పాత్ర పవర్ ఫుల్ గా ఉంటుందని అంతేకాదు ఈయన పాత్ర చనిపోతుందని.
అతడి మరణం తర్వాతనే చిరు పాత్ర పూర్తిగా మార్పు వస్తుందట.దడపా 40 నిముషాల నిడివితో రవితేజ పాత్ర ఉండబోతుందట.
రవితేజ ఈ రోల్ కోసం 20 రోజులు డేట్స్ ఇచ్చాడని అందుకు భారీ రెమ్యునరేషన్ కూడా అందుకుంటున్నాడని టాక్.మరి ఈ వార్తలో నిజమెంతో తెలియదు కానీ ఈ వార్త మాత్రం నెట్టింట వైరల్ అయ్యింది.