రావణాసుర పై చాలా ఆశలు.. బిజినెస్ విషయంలో ధమాకా కంటే ఎక్కువ!

మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ధమాకా సినిమా గత ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.100 కోట్లకు పైగా కలెక్షన్స్ నమోదు చేసిన ధమాకా సినిమా ఇంకా కూడా ఆడుతూనే ఉంది.ఈ సమయంలోనే రావణాసుర అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రవితేజ రెడీ అవుతున్నాడు.సుదీర్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ను ఏప్రిల్ 7వ తారీఖున విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటన వచ్చింది.

 Ravi Teja Ravanasura Movie Pre Release Business Details, Dhamaka, Khiladi Movie,-TeluguStop.com

ఈ సినిమా యొక్క విడుదల తేదీ ప్రకటించినప్పటి నుండి బిజినెస్ లెక్కలు ఆసక్తికరంగా వినిపిస్తున్నాయి.ధమాకా సినిమా తో పోలిస్తే రావణాసుర సినిమా ఏకంగా డబుల్ బిజినెస్ చేసింది అంటూ వార్తలు వస్తున్నాయి.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ధమాకా సినిమా కి ముందు రవితేజ నటించిన ఖిలాడి సినిమా నిరాశ పర్చడం తో చాలా ఏరియాల్లో ఆ సినిమా ను అమ్మడమే ఇబ్బందిగా మారిందట.

Telugu Dhamaka, Sudheer Verma, Khiladi, Ravanasura, Ravanasura Pre, Raviteja, Te

కానీ ఇప్పుడు ధమాకా సినిమా రూ.100 కోట్ల కలెక్షన్స్ నమోదు చేయడం తో రావణాసుర సినిమా కి అన్ని ఏరియాల్లో కూడా ఇద్దరు ముగ్గురు బయ్యర్స్ కొనేందుకు సిద్ధంగా ఉన్నారట.భారీ మొత్తం లో ఆఫర్ చేసి మరి రావణాసుర సినిమా ని కొనుగోలు చేసేందుకు బయ్యర్స్ రెడీ అవుతున్నారట.

ఈ నేపథ్యం లో రవితేజ సినిమా యొక్క నిర్మాతలు ఆచి తూచి వ్యవహరిస్తూ సినిమా యొక్క బిజినెస్ చేసినట్లుగా తెలుస్తోంది.

Telugu Dhamaka, Sudheer Verma, Khiladi, Ravanasura, Ravanasura Pre, Raviteja, Te

ధమాకా సినిమా భారీగా వసూళ్ల ను నమోదు చేసిన విషయం తెలిసిందే.అయితే ఆ స్థాయిలో ఈ సినిమా నమోదు చేస్తుందా లేదా అనేది మాత్రం తెలియాల్సి ఉంది.రావణాసుర సినిమాలో ఫరియా అబ్దుల్లా.

దక్ష నగర్కర్.పూజిత పొన్నాడ లు హీరోయిన్స్ గా కనిపించబోతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube