మాస్ మహారాజా రవితేజ హీరోగా విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఫాంటసీ చిత్రం డిస్కోరాజా.ఈ చిత్రం నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.
భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రంకు అనుకున్నట్లుగానే పాజిటివ్ టాక్ వచ్చింది.దాంతో అన్ని ఏరియాల్లో కూడా కలెక్షన్స్ పాజిటివ్‌గా వస్తున్నాయి.
సినిమా మొదటి రోజు దాదాపుగా 80 శాతం ఆక్యుపెన్సీని దక్కించుకున్నట్లుగా ట్రేడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.మొదటి రోజు ఈ సినిమా అన్ని ఏరియాల్లో కలిపి దాదాపుగా 6.5 కోట్ల షేర్‌ను రాబట్టినట్లుగా సమాచారం అందుతోంది.ఈ మద్య కాలంలో రవితేజ మూవీ ఈ స్థాయి ఓపెనింగ్స్‌ను దక్కించుకోవడం చాలా గొప్ప విషయంగా ఆయన అభిమానులు అంటున్నారు.
అతి త్వరలోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌ను సాధిస్తుందని సినీ వర్గాల వారు చాలా నమ్మకంగా చెబుతున్నారు.అన్ని ఏరియాల్లో కలిపి ఈ చిత్రంను 22 కోట్లకు అమ్మినట్లుగా తెలుస్తోంది.
ఈ వీకెండ్‌లో సినిమా 12 నుండి 15 కోట్ల వరకు రాబట్టే ఛాన్స్ ఉంది.అంటే మొదటి వారం తర్వాత సినిమా లాభాల బాట పట్టడం ఖాయం అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.రవితేజకు ఈ చిత్రం చాలా బూస్ట్ ఇచ్చిందని, తప్పకుండా ముందు ముందు రాబోతున్న సినిమాలకు ఇది ఒక మంచి మెట్టుగా ఉంటుందని రవితేజ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy