ట్రైలర్ తర్వాత అంచనాలు పీక్స్ కు చేరుకున్న ధమాకా.. ఈసారి హిట్ ఖాయమే!

ఇటీవల కాలంలో మాస్ మహారాజా రవితేజ సినిమాలకు భారీ క్రేజ్ రావడం లేదు.అందుకు చాలా కారణాలే ఉన్నాయి.

ఈయన ఒక సినిమాతో హిట్ అందుకుంటే వరుస ప్లాప్స్ అందుకుంటున్నాడు.దీంతో రవితేజ సినిమాలు అంటే క్రేజ్ తగ్గిపోతుంది.

క్రాక్ సినిమా హిట్ అందుకుని మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు అనుకుంటే ఆ వెంటనే మళ్ళీ రెండు ప్లాప్ సినిమాలు రావడంతో మాస్ రాజా ఫ్యాన్స్ కూడా ఢీలా పడిపోయారు.అయితే అనూహ్యంగా రవితేజ ఇప్పుడు చేస్తున్న సినిమాపై మాత్రం ఎప్పుడు లేనంత క్రేజ్ పెరిగి పోయింది.

ఇక రవితేజ కూడా ఆయన కెరీర్ లో ఎప్పుడు లేని విధంగా ప్రెజెంట్ చేస్తున్న సినిమా కోసం రెండు వారాల ముందు నుండే వరుస ప్రొమోషన్స్ లో పాల్గొంటూ బిజీ బిజీగా ఉన్నాడు.ప్రెసెంట్ రవితేజ త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ధమాకా సినిమా చేస్తున్నాడు.

Advertisement

ఈ సినిమాను కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాతో అయినా అన్ని ప్లాప్స్ ను మరిపించేలా హిట్ కొట్టాలని చూస్తున్నాడు.

ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తి అయి ప్రొమోషన్స్ కూడా స్టార్ట్ చేసారు.ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన ప్రొమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను అలరించాయి.

ఇక తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ తో ఈ సినిమా క్రేజ్ నెక్స్ట్ లెవల్ కు చేరిపోయింది అనే చెప్పాలి.ఎందుకంటే ఇటీవల కాలంలో రవితేజ సినిమాలకు ఎన్నడూ లేని విధంగా క్రేజ్ లభిస్తుంది.

దీంతో ఈ సినిమా గ్యారెంటీగా హిట్ అందుకోవడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలతో రేసులో వెనుకబడ్డ రవితేజ ఈ సినిమాతో కమ్ బ్యాక్ ఇస్తాడని అని అంతా భావిస్తున్నారు.

నాగచైతన్య శోభిత ధూళిపాళ మధ్య అన్నేళ్ల ఏజ్ గ్యాప్.. ఎన్ని సంవత్సరాలంటే?
ఆ పదవుల విషయంలో పోటా పోటీ .. బాబుని పవన్ ఒప్పిస్తారా ? 

ఇక ఈ సినిమాను క్రిస్మస్ బరిలో దింపబోతున్న విషయం తెలిసిందే.డిసెంబర్ 23న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.ఈ సినిమాలో రవితేజకు జోడీగా పెళ్లి సందడి బ్యూటీ శ్రీలీల నటిస్తుంది.

Advertisement

అలాగే వివేక్ కూచిభట్ల సహా నిర్మాతగా టీజీ విశ్వ ప్రసాద్ భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఇంక భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు.ఇందులో మాస్ మహారాజా, శ్రీలీల జోడీ ఎనర్జీ నెక్స్ట్ లెవల్ అని ఇప్పటికే వచ్చిన సాంగ్స్ చూస్తుంటేనే అర్ధం అవుతుంది.

తాజా వార్తలు