ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రెటిలుగా రానిస్తన్న చాలామంది ఒకానొక సమయంలో ఎన్నో రకాల కష్టాలను అవమానాలను ఎదుర్కొన్నవారే.తినడానికి కూడా తిండి లేక పస్తులు పడుకున్నా సెలబ్రిటీలు కూడా చాలామంది ఉన్నారు.
అలా అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంటారు సెలబ్రిటి హోదాను దక్కించుకున్న వారు చాలామంది ఉన్నారు.అటువంటి వారిలో ఇప్పటినుంచి తెలుసుకోబోయే హీరోయిన్ కూడా ఒకరు.
ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు ఏంటి అన్న వివరాల్లోకి వెళితే.వెండితెరపై వెలుగుల తర్వాత ఆమె ఇప్పుడుOTTలోకి ఎంట్రీ ఇచ్చింది.
ఆమే రవీనా టాండన్.

సినీ నిర్మాతలు రవి టాండన్, వీణా టాండన్‌ల కుమార్తె ఈ రవీనా టాండన్( Raveena Tandon ) అయితే ఆమెకు తన తండ్రి సినీ నేపథ్యం నుండి ఎటువంటి సపోర్ట్ లభించలేదు.ఫ్లోర్‌లను శుభ్రం చేయడం నుంచి ప్రజల వాంతులు శుభ్రం చేయడం వరకు అన్నీ చేశానని ఒక ఇంటర్వ్యూలో ఆమె తెలిపింది.ఒక ఇంటర్వ్యూలో భాగంగా హీరోయిన్ రవీనా టాండన్ మాట్లాడుతూ.
కెరీర్ ప్రారంభ రోజుల్లో స్టూడియో ఫ్లోర్‌లను శుభ్రం చేయడం, స్టాల్ ఫ్లోర్‌లు, స్టూడియో ఫ్లోర్‌ల నుండి వాంతులు శుభ్రం చేయడం చేశాను.నేను ప్రహ్లాద్ కక్కర్‌కు సహాయం చేశాను.
ఆ సమయంలో కూడా మీరు తెర వెనుక ఏం చేస్తున్నారంటూ చెప్పేవారు.

మీరు స్క్రీన్ ముందు ఉండాలి.అది మీ కోసం అనేవారు.అయితే నేను మాత్రం వద్దు, కాదు, నేను నటినా? అని అంటుండేదాన్ని.నేను డిఫాల్ట్‌గా ఇండస్ట్రీలో ఉన్నాను.నటిని అవుతానని నేనెప్పుడూ అనుకోలేదు అని చెప్పుకొచ్చింది రవీనా టాండన్.సల్మాన్ ఖాన్( Salman Khan ) నటించిన పత్తర్ కే ఫూల్ సినిమాలో రవీనాకి మొదటి బ్రేక్ వచ్చింది.ఈ సినిమా కమర్షియల్ గా హిట్ అయింది.రవీనా టాండన్ రాత్రికి రాత్రే స్టార్ అయిపోయిన సినిమా ఇది.1994లో రవీనా టాండన్ నటించిన ఒకటి కాదు 10 సినిమాలు విడుదలై చాలా వరకు విజయం సాధించాయి.వీటిలో మొహ్రా, దిల్‌వాలే, ఆతీష్, లాడ్లా అనే నాలుగు చిత్రాలు ఆ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలుగా నిలిచాయి.దీని తర్వాత అతను అనారీ నంబర్ 1, బడే మియాన్ ఛోటే మియాన్, ఖిలాడీ కా ఖిలాడి, ఘర్వాలీ బహర్వాలీ, ఆంటీ నంబర్ 1, జిద్ది వంటి అనేక బ్లాక్ బస్టర్లు వంటి హిట్ సినిమాలు ఆమె అకౌంట్ లో ఉన్నాయి.







