బిగ్ బాస్ ( Bigg Boss ) కార్యక్రమంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు.ఈ కార్యక్రమంలో జరిగే కొన్ని విషయాలు మాత్రం ముందుగానే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హల్చల్ చేస్తుంటాయి.
ముఖ్యంగా ఎలిమినేషన్ విషయంలో సోషల్ మీడియాలో వచ్చే వార్తలే నిజమవుతాయనే విషయం తెలిసిందే.సోషల్ మీడియాలో ఎలిమినేషన్ గురించి ఒక రోజు ముందుగానే వార్తలు వైరల్ అవుతుంటాయి.
అయితే ఈ వార్తలకు అనుగుణంగానే కంటెస్టెంట్లు కూడా బయటకు వెళ్ళిపోతూ ఉంటారు.ఇక ఈవారం ఊహించని విధంగా రతిక ( Rathika ) ఎలిమినేట్ అవ్వబోతున్నారు అంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
టాప్ త్రీ లో ఉండాల్సిన కంటెంట్ ఇలా నాలుగవ వారం ఎలిమినేట్ కావడం ఏంటి అంటూ కొందరు ఆశ్చర్యపోగా మరికొందరు మాత్రం హామ్మయ్య బిగ్ బాస్ కార్యక్రమానికి పట్టిన శని పోతుంది అంటూ ఆనందపడుతున్నారు.అయితే రతిక ఎలిమినేట్ అవ్వబోతుంది అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈమె ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా ఓ వార్త వైరల్ గా మారింది.రతిక ఎలిమినేట్ కానుందని ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అయితే ఆమె హౌస్ లో ఉంటూ టాప్ త్రీ లో ఉండాల్సిన కంటెంట్ అమర్ దీప్ ( Amar Deep ) లాంటి కొందరి నెగిటివ్ ఆలోచనలు ఉన్నటువంటి వారి కారణంగానే ఈమె ఎలిమినేట్ కావాల్సి వస్తుందని చెప్పుకొచ్చారు.
ఇలాంటి కొందరు నెగిటివ్ వ్యక్తుల కారణంగా ఆమె తప్పుడు దారిలో నడుస్తుందని దయచేసి ఆమెను ఎలిమినేట్ చేయకుండా సీక్రెట్ రూమ్( Secret Room ) లోకి పంపించి తన వెనుక ఎలా కుట్ర జరుగుతుందో తనకు తెలిసేలా చేయండి హౌస్ లో ఉన్న వాళ్ళు ఎవరు తన మంచి కోరుకుంటున్నారు ఎవరు తన చెడు కోరుకుంటున్నారు తనకు తెలిసేలా చేయండి.రతిక చాలా మంచి అమ్మాయి కొందరు నిన్ను వాడుకుంటున్నారు అంటూ పోస్ట్ చేశారు.ఇక ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ గా మారడంతో కొందరు ఈ పోస్ట్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. బిగ్ బాస్ నిబంధనలకు విరుద్ధంగా ఇలా ఎలిమినేట్ కాకుండానే ముందుగానే పోస్టులు చేయడం ఏంటి అంటూ ఈ పోస్ట్ పై కామెంట్లు చేయడంతో వెంటనే ఈ పోస్ట్ డిలీట్ చేశారు.
అయితే అప్పటికే ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.