రౌడీ హీరో విజయ్ దేవరకొండ ( Vijay Deverakonda ) ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తన 12వ చిత్రాన్ని ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను ప్రారంభించుకోబోతుంది.
ఇప్పటికీ పూజ కార్యక్రమాలను ప్రారంభించుకున్నటువంటి ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాలని ప్రయత్నాలు చేసారు.ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన నటి శ్రీ లీల( Sreeleela ) హీరోయిన్ పాత్రలో నటించే అవకాశాన్ని అందుకున్నారు.
అయితే ఈ సినిమా షూటింగ్ మొదలు అయ్యే సమయానికి ఈ సినిమా నుంచి తప్పుకున్నారని తెలుస్తోంది.

శ్రీ లీల ఇలా ఈ సినిమా నుంచి తప్పుకోవడానికి సరైన కారణం తెలియక పోయినప్పటికీ ఈ సినిమా నుంచి ఈమె తప్పుకోవడంతో ఈమె స్థానంలోకి నటి రష్మిక మందన్న( Rashmika Mandanna ) ను ఎంపిక చేశారని తెలుస్తుంది.ఇలా శ్రీ లీల స్థానంలోకి రష్మిక రావడంతో ఇద్దరి కాంబినేషన్లో రాబోతున్నటువంటి ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు పెరిగిపోయాయి ఎందుకంటే ఇదివరకు రష్మిక విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు మంచి సక్సెస్ అందుకున్నాయి.ఇక ఈ జోడి ముచ్చటగా మూడోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు అంటూ ఒక వార్త వైరల్ గా మారింది.

ఇలా రష్మిక విజయ్ దేవరకొండ నటించబోతున్నారంటూ వస్తున్నటువంటి ఈ వార్తలపై మేకర్స్ ఎక్కడ అధికారికంగా స్పందించలేదు కానీ ఈ వార్తలు మాత్రం వైరల్ అవుతున్నాయి.ఇక ఈ విషయం తెలిసి రష్మిక విజయ్ ఫ్యాన్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇకపోతే ఇప్పటికే రెండు సినిమాలలో నటించినటువంటి ఈ జంట గురించి సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వస్తున్న సంగతి మనకు తెలిసిందే.వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని ఇద్దరు సహజీవనం చేస్తున్నారు అంటూ తరచూ వీరి రిలేషన్ గురించి ఎన్నో వార్తలు వస్తున్నాయి ఇలాంటి తరుణంలో వీరిద్దరూ మరో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారనడంతో మరోసారి కూడ వీరి డేటింగ్ రూమర్స్( Vijay Rashmika Dating Rumors ) కూడా వైరల్ అవుతున్నాయి.