శర్వానంద్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్ గా కిషోర్ తిరుమల దర్శకత్వం లో తెరకెక్కిన ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా కు మిశ్రమ స్పందన లభించింది.ఈ సమయంలో సినిమా కు మిశ్రమ స్పందన వస్తే వసూళ్లు భారీగా నమోదు అవడం కష్టం.
పైగా పవన్ నటించిన భీమ్లా నాయక్ సినిమా కూడా థియేటర్ లలో ఆడుతుంది.ఈ సమయం లో ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా ఏ మేరకు ఆడుతుంది అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.
మొదటి రోజు సినిమా పాజిటివ్ వసూళ్లను దక్కించుకున్నా ఆ తర్వాత పెద్దగా ఉండకపోవచ్చు అని ప్రచారం జరిగింది.కానీ అనూహ్యంగా సినిమాకు మంచి వసూళ్లు నమోదు అవుతున్నాయని ట్రేడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

విడుదలైన మూడు రోజుల్లో పాజిటివ్ వసూళ్లు నమోదు కాగా ఇప్పటికే కొన్ని ఏరియాల్లో వసూళ్లు బ్రేక్ ఈవెన్ కి చేరువ అయ్యాయని సమాచారం అందుతోంది. శర్వానంద్ కు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంది, పైగా రష్మిక పుష్ప సినిమా తో స్టార్ గా నిలిచింది.వీరిద్దరి కాంబో లో సినిమా అవ్వడం తో యూత్ ఆడియన్స్ పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా విపరీతంగా సినిమాలు చూసేందుకు థియేటర్ల వద్ద క్యూలో నిలుచున్నారు అని ట్రేడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.ఈ సినిమా వసూళ్ల విషయంలో చిత్ర నిర్మాతలు మరియు బయ్యర్లు చాలా సంతోషంగా ఉన్నారు అంటూ టాక్ వినిపిస్తుంది.
ముఖ్యంగా మహిళా ప్రేక్షకులు ఈ సినిమాను అమితంగా ఆదరిస్తున్నారని అంటున్నారు.అందుకే యూనిట్ సభ్యులు ఆడవాళ్ళు మీకు నిజంగానే జోహార్లు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
శర్వానంద్ అభిమానులు మాత్రం పూర్తి స్థాయిలో ఈ సినిమాపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు గా లేరు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.