టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన( Rashmika Mandanna ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.రష్మిక మందన టాలీవుడ్ తో పాటు బాలీవుడ్, కోలీవుడ్ సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉంది.
కాగా రష్మిక ప్రస్తుతం వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది.చలో సినిమాతో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.
ఇక టాలీవుడ్ లో మహేష్ బాబు, అల్లు అర్జున్, నాగశౌర్య లాంటి స్టార్ హీరోల సరసన సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది.

అల్లు అర్జున్ నటించిన పుష్ప మూవీతో( Pushpa Movie ) పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.ఇకపోతే తాజాగా సోషల్ మీడియాలో రష్మికకు సంబంధించిన ఒక వార్త వైరల్ గా మారింది.అదేమిటంటే ఈ మధ్యకాలంలో రష్మిక ఏ సినిమాలో నటించిన కూడా ఆ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతోంది.
అందుకే ఆమె హీరోల పాలిట లక్కీ హీరోయిన్ అనిపించుకుంటోంది.వరస పరాజయాలతో ఉన్న నాగశౌర్యకు ఛలో,( Chalo ) నితిన్‌కి భీష్మ( Bheeshma ) వంటి సూపర్ హిట్ సినిమాలు అందించి లక్కీ హీరోయిన్ అనే పేరును సుస్థిరం చేసుకుంది.2016లో కన్నడలో రూపొందిన కిరిక్ పార్టీ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైంది రష్మిక.

ఇక అప్పటి నుంచి అతి తక్కువ సమయంలోనే వరుసగా సినిమా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోయింది రష్మిక.రష్మిక నటించిన చలో, గీతా గోవిందం, సరిలేరు నీకెవ్వరు, భీష్మ, పుష్ప లాంటి సినిమాలలో నటించి మెపపించింది రష్మిక.ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పుష్ప 2 మూవీలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా ఉంది.
అలాగే యానిమల్ సినిమాతో( Animal Movie ) కూడా బాలీవుడ్లో క్రేజ్ ని సంపాదించుకుంది.దీంతో ఇండియా లెవల్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది రష్మిక.ఎనిమిదేళ్ళ సినీ కెరీర్‌లో దాదాపు పాతిక సినిమాల్లో నటించింది.ప్రస్తుతం రష్మిక హీరోయిన్‌గా నటిస్తున్న నాలుగు సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి.
వాటిలో పుష్ప2 కూడా ఉంది.ఈ సినిమాతో రష్మిక రేంజ్ మరింత పెరిగే అవకాశం ఉంది.







