యాంకర్ రష్మీ సుడిగాలి సుధీర్ జోడీ బ్యూటిఫుల్ జోడీ కాగా కొన్ని కారణాల వల్ల ప్రస్తుతం బుల్లితెరపై ఈ జోడీ కనిపించడం లేదు.సుధీర్, రష్మీలను కలపాలని పలు టీవీ ఛానెళ్లు ప్రయత్నాలు చేస్తుండగా ఆ ప్రయత్నాలు వర్కౌట్ అవుతాయో లేదో చూడాలి.
తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో రిలీజ్ కాగా ఈ ప్రోమోలో రష్మీ ప్రవర్తన చూసి నెటిజన్లు, సుధీర్ అభిమానులు ఒకింత ఫీలవుతుండటం గమనార్హం.
వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదలైన శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమోలో ఆది ప్రేమ గురించి చెబుతూ ప్రేమంటే గెలవడం కాదని గెలకడం అని అన్నారు.
ఫిబ్రవరి 14వ తేదీ కాబట్టి ఒకరికి గట్టిగా ఒకటి ఇవ్వాలని అనుకుంటున్నానని రష్మీ చెప్పగా హైపర్ ఆది నాకు ఇచ్చేయండి నేను ఇచ్చేస్తా అతనికి అని చెబుతాడు.ఇంతకీ బాబుకు ఏమైనా గిఫ్ట్ ఇచ్చావా బాబుకు గిఫ్ట్ ఇవ్వకపోయినా పరవాలేదు కానీ ఏదో ఒకరోజు బాబును ఇవ్వడం అలాంటివి చేయకు అని హైపర్ ఆది కామెంట్ చేశారు.

రాకేశ్ తో సుజాత ఇప్పుడు ఎలా ఉన్నామో అలానే టామ్ అండ్ జెర్రీలా ఉండాలని కోరుకుంటున్నామని చెప్పుకొచ్చారు.ఆ తర్వాత వర్ష ఇమ్మాన్యుయేల్ పేర్లతో ఫ్లేమ్స్ చెక్ చేస్తే మ్యారేజ్ అని వస్తుంది.ఇక్కడ పరదేశి వర్ష కూడా మ్యారేజ్ అని వచ్చిందంటూ నరేష్ బాంబు పేల్చారు.ఆ తర్వాత రష్మీ నీ పేరుతో ఎవరితో చూడను అంటూ సుధీర్ నిక్ నేమ్ అయిన సిద్ధు అని రాస్తానని ఆది తెలిపారు.

ఆ పేరుతో ఉన్న పేపర్ ను రష్మీ చించేయడంతో పాటు కన్నీళ్లు పెట్టుకున్నారు.ఈ ప్రోమోకు 2,50,000 లక్షల వ్యూస్ వచ్చాయి.సుధీర్ రష్మీలకు బ్రేకప్ జరగడం వల్లే ఆమె ఈ విధంగా వ్యవహరించారని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వినిపిస్తున్నాయి.
