క్లిక్‌ క్లిక్‌ : ఈమె ఇంకా సన్నగా అవుతుందా ఏంటీ!

ఊహలు గుసగుసలాడే సినిమా తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ రాశి ఖన్నా టాలీవుడ్ లో మొదటి సినిమా తోనే మంచి సక్సెస్ ను దక్కించుకుంది.తెలుగు లో ఈ అమ్మడు మంచి ఎంట్రీ దక్కించుకున్న నేపథ్యం లో వరుసగా ఆఫర్లు దక్కాయి.

 Rashi Kanna New Cute And Stylish Photos , Flim News , Movie News, Rashi Kanna ,-TeluguStop.com

మొదటి సినిమాలో బొద్దుగా ముద్దుగా కనిపించిన ఈ అమ్మడు ఆ తర్వాత సినిమా ల్లో మరింత లావుగా కనిపించింది.లావుగా ఉన్నా బొద్దుగా ముద్దుగా ఉంది అంటూ చాలా మంది రాశి ఖన్నాను అభిమానించడం మొదలు పెట్టారు.

అందమైన రాశిఖన్నా బొద్దుగుమ్మ ఉంటే ఆఫర్లు తగ్గాయి అనే వార్తలు ఆ మద్య వచ్చాయి.ఆ కారణమో లేదా మరేంటో కాని రాశి ఖన్నా దాదాపుగా పది కేజీల బరువు తగ్గింది అంటూ వార్తలు వచ్చాయి.

బరువు తగ్గిన రాశి ఖన్నా లుక్ కు అంతా కూడా అప్పుడు షాక్ అయ్యారు.ఇంత స్పీడ్‌ గా బరువు తగ్గడం ఎలా అంటూ అవాక్కయ్యారు.

తాజాగా రాశి షేర్ చేసిన ఈ ఫోటోలను చూస్తుంటే ఈమె ఇంకా బరువు తగ్గుతూనే ఉందా అనిపిస్తుంది.

బాబోయ్ మరీ ఇంత సన్నగా అయ్యింది ఏంటీ అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం సక్కన్నమ చిక్కినా అందమే అన్నట్లుగా అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ఈ అమ్మడి అందాల ఆరబోత చేస్తూ అందరిని ఆకట్టుకుంటూ ఉంది.ఊహలు గుసగులాడే సినిమా తో హీరోయిన్ గా పరిచయం అయిన సమయంలో ఈ అమ్మడు ఉన్న తీరుకు ఇప్పుడు ఉన్న తీరుకు ఏమాత్రం పోలికే లేదు అన్నట్లుగా అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

అభిమానులు ఈ రేంజ్ మార్పును ప్రశంసిస్తూ ఉన్నారు.ఆకట్టుకునే అందం ఈమె సొంతం అన్నట్లుగా రాశి ఖన్నా ఫోటోలకు ఫిదా అవుతున్నారు.ఇక ఈమె తాజా సినిమా ల విషయానికి వస్తే చైతూ తో కలిసి ఇప్పటికే థ్యాంక్యూ సినిమా ను చేసింది.ఆ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది.

తమిళంలో రెండు సినిమా లను ఈ అమ్మడు చేస్తోంది.త్వరలోనే విడుదల కాబోతున్నాయి.

తెలుగు లో మరో పెద్ద సినిమా కు ఈమె ఓకే చెప్పిందని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube