కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ దళపతి నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘వారసుడు’.తమిళ్ లో ‘వరిసు’ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ క్రేజీ సినిమాపై ఇప్పటికే తమిళ్ లో అంచనాలు పీక్స్ కు చేరుకున్నాయి.
టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
తమిళ్ లో తిరుగులేని ఫాలోయింగ్ తెచ్చుకున్న విజయ్ ఇప్పుడు తెలుగులో కూడా మెప్పించడానికి టాలీవుడ్ డైరెక్టర్ తో చేతులు కలిపాడు.
కానీ ఇది తెలుగు సినిమా కాకపోవడంతో ఇక్కడ ఇప్పటి వరకు పెద్ద అంచనాలు అయితే రాలేదు.ముందు బైలింగ్వన్ సినిమా అని చెప్పిన మేకర్స్ ఇటీవల డైరెక్ట్ తమిళ్ సినిమా అని చెప్పడంతో తెలుగు ప్రేక్షకులు అయితే ఈ సినిమాపై గుర్రుగా ఉన్నారు.
ఇదిలా ఉండగా ఇటీవలే ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ వచ్చింది.

థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుండి రంజితమే అనే సాంగ్ రిలీజ్ చేయగా అది సోషల్ మాధ్యమాలను షేక్ చేస్తుంది.ఇక అప్పుడు కేవలం తమిళ్ వర్షన్ మాత్రమే రిలీజ్ చేయగా ఇప్పుడు ఈ సాంగ్ తెలుగు వర్షన్ ను రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు.
రంజితమే తెలుగు వర్షన్ ను రేపు ఉదయం 9 గంటల 09 నిముషాలకు రిలీజ్ చేయనున్నట్టు అఫిషియల్ గా తెలిపారు.
మరి తమిళ్ లో సూపర్ హిట్ అయిన ఈ సాంగ్ తెలుగులో ఎంతటి విజయం అందుకుంటుందో చూడాలి.ఇక సంక్రాంతి కానుకగా 2023 జనవరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎలా ఉంటుందో ఎలాంటి హిట్ అందుకుంటుందో వేచి చూడాల్సిందే.







