నిత్యానంద( Nityananda ) గురించి ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ప్రేక్షకుల్లో నిత్యానంద విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.
నిత్యానంద వల్ల కెరీర్ ను నాశనం చేసుకున్న హీరోయిన్లలో రంజిత( Ranjitha ) ఒకరు.రంజిత తండ్రి అశోక్ కుమార్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు.
అప్పట్లో నేను హైదరాబాద్ లో పోలీస్ గా పని చేశానని ఆయన తెలిపారు.
ఆ తర్వాత ఉద్యోగం మానేసి హోటల్ వ్యాపారం చేయగా ఆ వ్యాపారంలో నష్టాలు వచ్చాయని అశోక్ కుమార్( Ashok Kumar ) అన్నారు.
మద్రాస్ కు వెళ్లి సినిమా ప్రయత్నాలు చేయగా 40 సంవత్సరాలలో కేవలం 25 సినిమాలు చేశానని ఆయన తెలిపారు.తాను విలన్ రోల్స్ లో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పని చేస్తున్నానని ఆయన చెప్పుకొచ్చారు.
కొన్ని సినిమాలలో నన్ను హీరోగా తీసుకున్నారని కానీ ఆ తర్వాత తొలగించారని అశోక్ కుమార్ చెప్పుకొచ్చారు.

పోలీస్ ఆఫీసర్ గా పని చేయడం వల్ల నాకు పొగడటం అనేది అలవాటు లేదని అశోక్ కుమార్ అన్నారు.సినిమా ఇండస్ట్రీలో పొగిడితే తప్ప పనులు కావని ఆయన కామెంట్లు చేశారు.రంజిత నా కూతురు అని నిత్యానంద, రంజితలకు పెళ్లి జరిగినట్టు ఫోటోలు ఉన్నాయని అయితే ఆ ఫోటోలు నిజమో కాదో తెలియదని ఆయన తెలిపారు.
రంజితకు సినిమాలు ఇష్టం లేకపోయినా సినిమాలు చేసిందని అశోక్ కుమార్ అన్నారు.

రంజితది లవ్ మ్యారేజ్ అని ఆమె భర్తతో విడాకులు తీసుకుందని ఆయన తెలిపారు.నిత్యానందతో నేను గొడవ పడ్డానని అశోక్ కుమార్ చెప్పుకొచ్చారు.రంజిత అక్క, రంజిత ఇద్దరూ భర్తలకు దూరంగా ఉంటూ నిత్యానంద ఆశ్రమంలో ఉన్నారని ఆయన తెలిపారు.
ఫైనాన్షియల్ గా హ్యాపీ అని అశోక్ కుమార్ తెలిపారు.మేము సంతోషంగా ఉన్నామని మూడో కూతురుకు మాత్రం రంజిత అక్క, రంజిత మెసేజ్ పెడతారని ఆయన అన్నారు.
రంజిత జీవితంలో జరిగిన ఘటనలను భరించలేక తల్లి చనిపోయిందని అశోక్ కుమార్ అన్నారు.







