'యానిమల్' టీజర్ రిలీజ్.. ఇంటెన్స్ లుక్ లో అదిరిన రణబీర్ లుక్!

బాలీవుడ్ సినిమా దగ్గర భారీ అంచనాలతో రాబోతున్న పాన్ ఇండియన్ సినిమాల్లో ”యానిమల్”( Animal ) ఒకటి.ఈ సినిమా కోసం బాలీవుడ్ ఆడియెన్స్ మాత్రమే కాదు పాన్ ఇండియన్ ఆడియెన్స్ అంతా ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

 Ranbir Kapoor's Animal Teaser, Animal, Ranbir Kapoor, Animal Teaser, Rashmika Ma-TeluguStop.com

ముఖ్యంగా తెలుగు ఆడియెన్స్ అయితే అంచనాలు పెంచేసుకున్నారు.ఎందుకంటే ఈ సినిమాను మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ( Sandeep Reddy Vanga ) తెరకెక్కించడం వల్ల ఈ సినిమాపై సౌత్ వారు కూడా ద్రుష్టి పెట్టారు.

తెలుగు డైరెక్టర్ కాబట్టి హిందీ ఆడియెన్స్ తో పాటు తెలుగు ఆడియెన్స్ ను కూడా మెప్పించే విధంగా సినిమాను తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది.ఇక అతి త్వరలోనే రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో సందీప్ ప్రమోషన్స్ షురూ చేసాడు.బాలీవుడ్ యంగ్ హీరో రణబీర్ కపూర్( Ranbir Kapoor ) హీరోగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ‘యానిమల్’ సినిమా నుండి వీరిద్దరి ఫస్ట్ లుక్స్ ఇప్పటికే వచ్చేసాయి.

ఇటీవలే యానిమల్ విలన్ ను కూడా పరిచయం చేసిన సందీప్ రెడ్డి ఇప్పుడు ఏకంగా టీజర్ రిలీజ్ చేసి అంచనాలు అమాంతం పెంచేసాడు. టీజర్( Animal Teaser ) తో అంచనాలు నెక్స్ట్ లెవల్ కు చేర్చేందుకు మేకర్స్ చేసిన ప్రయత్నాలు సక్సెస్ అయ్యాయనే చెప్పాలి.ఈ టీజర్ ఆద్యంతం ఇంటెన్స్ గా సాగిపోయింది.

ఈ టీజర్ ను చూస్తుంటేనే సినిమా లైన్ అర్ధం అయిపొయింది.

రణబీర్ కపూర్ మూడు షేడ్స్ లో కనిపించి తన నటనలో విశ్వరూపాన్ని చూపించాడు.అర్జున్ రెడ్డి తరహాలోనే రణబీర్ కపూర్ ను కూడా చూపించి ఆడియెన్స్ కు ఫుల్ కిక్ ఎక్కించాడు.బాలీవుడ్ స్టార్ యాక్టర్ బాబీ డియోల్( Bobby Deol ) విలన్ గా తన నటనలోని మరో కోణాన్ని చూపించాడు.

మొత్తానికి టీజర్ అదిరిపోయింది అనే చెప్పాలి.డిసెంబర్ 1న గ్రాండ్ గా పాన్ ఇండియా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు హర్ష వర్ధన్ సంగీతం అందిస్తుండగా టి సిరీస్, భద్రకాళి పిక్చర్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube