మన తెలుగు లో ఎన్టీఆర్ ఫ్యామిలీ, ఏఎన్నార్ ఫ్యామిలీ ఎలాగో,బాలీవుడ్ లో కపూర్ ఫ్యామిలీ అలా అన్నమాట.సుమారుగా ఈ కుటుంబం నుండి నాలుగు తారలు ఎన్నో అద్భుతమైన సినిమాలను ఆడియన్స్ కి అందించి తిరుగులేని వినోదం ని పంచారు.
ఈ కుటుంబం నుండి నేటి తరం లో రణబీర్ కపూర్( Ranbir kapoor ) పెద్ద సూపర్ స్టార్ గా ఎదిగాడు.తానూ ఒక పెద్ద లెజండరీ కుటుంబానికి చెందిన వాడిని అనే గర్వం ఇతనిలో ఇస్తుమంతా కూడా కనిపించదు.
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్టు లేకుండా ఇండస్ట్రీ కి వస్తే ఎలా కష్టపడుతారో, అదే రేంజ్ లో కష్టపడే మనస్తత్వం ఉన్న వ్యక్తి ఆయన.అందుకే ఈ జనరేషన్ లో ఇంత పెద్ద సూపర్ స్టార్ గా నిలిచాడు.ప్రస్తుతం ఆయన హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఎనిమల్‘ డిసెంబర్ 1 వ తారీఖున విడుదల అవ్వబోతుంది.

అర్జున్ రెడ్డి మరియు కబీర్ సింగ్ వంటి సంచలనాత్మక చిత్రాలను తెరకెక్కించి యూత్ లో కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న సందీప్ వంగ ( Sandeep Reddy Vanga )ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.రీసెంట్ గానే విడుదలైన ట్రైలర్ ఈ చిత్రం పై ఒక రేంజ్ లో హైప్ ని పెంచింది.ప్రతీ షాట్ లోను సందీప్ వంగ మార్క్ కనిపించింది.
అలాగే రణబీర్ కపూర్ ఈ సినిమా లో తన నట విశ్వరూపం చూపించినట్టుగా కూడా అనిపించింది.ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల్లో మూవీ టీం మొత్తం క్షణ కాలం తీరిక లేకుండా గడుపుతుంది.
హిందీ తో పాటుగా తెలుగు లో కూడా ప్రొమోషన్స్ ని చాలా సీరియస్ గా తీసుకున్నారు.తాజాగా ఆయన ఇండియన్ ఐడల్ 14 వ సీజన్( Indian Idol 14 ) లోని ఒక ఎపిసోడ్ లో పాల్గొన్నాడు./br>

ఈ ఎపిసోడ్ లో మేనకా పౌడల్ అనే దివ్యాంగరాలు అద్భుతంగా పాడింది.‘అగర్ తుమ్ సాత్ హొ‘ అంటూ సాగే ఈ పాటని ఆమె ఎంతో అద్భుతంగా పాడడం తో రణబీర్ కపూర్, హీరోయిన్ రష్మిక తో కలిసి స్టేజి పైకి వచ్చి మౌనిక పాదాలకు దండం పెడుతాడు.ఇది చూసి అందరూ షాక్ కి గురయ్యారు.అనంతరం రణబీర్ మాట్లాడుతూ ‘హాయ్ మౌనిక.నా పేరు రణబీర్ కపూర్, ఈ పాట ని ప్రముఖ సింగర్ శ్రేయా ఘోషల్ గారు పాడినప్పుడు నాకు ఎలాంటి అనుభూతి కలిగిందో, నువ్వు పాడినప్పుడు కూడా అలాంటి అనుభూతి కలిగింది.శ్రేయా ఘోషల్ గారు సంగీత ప్రియులకు దేవతతో సమానం.
ఇప్పుడు మీరు రెండవ దేవతగా కనిపిస్తున్నారు’ అంటూ చెప్పుకొచ్చాడు రణబీర్.







