'షంషేరా' లో రెండు పాత్రల్లో కనిపించనున్న రణబీర్

బ్లాక్‌బస్టర్ “సంజు” సినిమా తర్వాత రణబీర్ కపూర్ నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ షంషేరా. ఈ చిత్రం ట్రైలర్ లో తన అద్భుతమైన నటనా తీక్షతతో అందరినీ ఆశ్చర్యపరిచారు రణబీర్.

 Ranbir Kapoor Played Dual Role In Shamshera Movie Details, Ranbir Kapoor , Ranbi-TeluguStop.com

ఈ ప్రతీకార చిత్రంలో తండ్రి, షంషేరా మరియు కొడుకు బల్లిగా రణబీర్ నటిస్తున్నా విషయాన్ని ట్రైలర్ తెలియజేస్తుంది.రణబీర్ ఒకే చిత్రంలో రెండు పాత్రలు పోషించడం ఇదే మొదటిసారి.

రణబీర్ ఒక ఈ చిత్ర ప్రచార వీడియోలో తనపై తానే సెటైర్లు వేసుకోవడాన్ని చూడవచ్చు! హిలేరియస్ ‘ది అదర్ కపూర్ షో’.షంషేరా కథ కల్పిత నగరమైన కాజాలో జరుగుతుంది.ఇక్కడ ఒక యోధులకు చెందిన కొంతమంది ఖైదు చేయబడి, బానిసలుగా అధికార జనరల్ షుద్ సింగ్ చేత హింసించబడుతుంటారు.

ఇది బానిసగా మారిన వ్యక్తి నాయకుడిగా ఎదిగే కథ.అతను తన వాళ్ళ స్వేచ్ఛ మరియు గౌరవం కోసం అవిశ్రాంతంగా పోరాడుతాడు.అతని పేరు షంషేరా.

హై-ఆక్టేన్, అడ్రినలిన్-పంపింగ్ ఎంటర్‌టైనర్‌గా 1800లలో భారతదేశంలో జరిగిన కొన్ని ఘటనలను నేపథ్యంగా తీసుకుని దీన్ని చిత్రీకరించారు.ఈ చిత్రంలో షంషేరా పాత్రలో నటించిన రణబీర్ కపూర్ గతంలో ఎన్నడూ చేయని పాత్రను ఇందులో చేశారు! తిరుగుబాటు ఉద్యమం ఉన్న ఈ చిత్రంలో రణబీర్‌కు బద్ధ శత్రువుగా సంజయ్ దత్ నటించారు.

ఈ యాక్షన్ ఎంటర్‌టెయినర్‌ను ఆదిత్య చోప్రా నిర్మించారు.జూలై 22, 2022న హిందీ, తమిళం మరియు తెలుగు భాషల్లో విడుదల కానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube