విశాఖపట్నం కాలుష్య నియంత్రణ లో భాగంగా మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ తీసుకున్న నిర్ణయం మేరకు ప్రతి సోమవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయం లోనికి ఎటువంటి వాహనాలకు అనుమతి లేనందున నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి సోమవారం ఉదయం ఆరిలోవ లోని క్యాంప్ ఆఫీస్ నుండి నడుచుకుంటూ అక్కడకు దగ్గరలో ఉన్న బస్టాప్ కి చేరుకొని బస్సులో ప్రయాణించి జీవీఎంసీ ప్రధాన కార్యాలయం కు చేరుకొని డయల్ యూవర్ మేయర్ కార్యక్రమం అనంతరం స్పందన కార్యక్రమంలో పాల్గొన్నారు.విశాఖ మహా నగరాన్ని కాలుష్య నివారణ లొ ప్రభుత్వ ఉద్యోగులందరూ భాగస్వాములు అవ్వాలని తొలిత ప్రైవేట్ వాహనాలను తక్కువగా వినియోగించి ప్రభుత్వ ఉద్యోగులందరూ ప్రభుత్వ వాహనాలను వినియోగించుకొని నగరంలోని ప్రజలందరూ తమ వంతు బాధ్యతను తెలియజేయడానికి ప్రతి సోమవారము ప్రభుత్వ వాహనాలను ఆర్టీసీ బస్సు ఉపయోగించి విధులకు హాజరు కావాలని కోరారు మూలముగా నగర ప్రజలలో కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దడానికి అవగాహన కల్పిస్తున్నారు







