జీవితంలో గొప్ప అదృష్టం అదే.. రానా భార్య కామెంట్లు వింటే షాకవ్వాల్సిందే!

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన రానా( Rana ) గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.దగ్గుబాటి రామానాయుడు మనవడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి హీరోగా, విలన్ గా బాగానే మెప్పిస్తున్నాడు.

 That Is The Greatest Luck In Life, Rana, Shared A Photo , Instagram, Mihika-TeluguStop.com

ఇక ఇతని భార్య మిహికా గురించి అందరికీ తెలిసిందే.రెండేళ్ల కిందట రానా మిహిక ను కుటుంబ సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నాడు.

ఇక పెళ్లి తర్వాత ఈ జంట చూడముచ్చటగా అందరి దృష్టిలో పడ్డారు.

ఇక ఇప్పటివరకు వీరు పిల్లలను ప్లాన్ చేసుకోకపోగా ఆ మధ్య వీరి గురించి బాగా పుకార్లు కూడా వచ్చాయి.

కానీ వాటికి ఎప్పటికప్పుడు ఫుల్ స్టాప్ పెట్టేసింది మిహికా.ఇక తను సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.ఎప్పటికప్పుడు ఫ్యామిలీకి సంబంధించిన అప్డేట్స్ సోషల్ మీడియాలో పంచుకుంటుంది.రానా కూడా తమ ఫ్యామిలీ ఫోటోలను( Family photos ) బాగా పంచుకుంటాడు.

ఇక మిహికా( Mihika ) చూడటానికి హీరోయిన్ మెటీరియల్ అని చెప్పాలి.

చూడటానికి చాలా అందంగా ఉండటమే కాకుండా స్టైలిష్ బట్టలు వేస్తూ ప్రతి ఒక్కరిని ఫిదా చేస్తుంది.తను సినిమాలలో ట్రై చేస్తే కచ్చితంగా హీరోయిన్ అయ్యే లక్షణాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పాలి.కానీ తనకు ఇండస్ట్రీపై అంత ఆసక్తి లేదు అని తెలుస్తుంది.

ఇక అప్పుడప్పుడు ఈమె షేర్ చేసే పోస్టులు బాగా వైరల్ అవుతూ ఉంటాయి.అయితే తాజాగా తను ఇన్ స్టాలో ఒక ఫోటో పంచుకుంది.

అంతేకాకుండా ఒక విషయాన్ని రాసుకొచ్చింది.

ఇక ఆ ఫోటోలో తన మెడపై బ్యాలెన్స్ అని రాసి ఉన్న టాటూ ను చూపిస్తూ ఈ విధంగా రాసుకొచ్చింది.జీవితంలో గొప్ప అదృష్టం ఏంటంటే సమతుల్యత అని.మన జీవితంలో బాధ్యతలు, అభిరుచుల మధ్య సామరస్యాన్ని కనుగొనడం.మీరు నైపుణ్య స్థాయిని అదుపులో ఉంచే శక్తిని మీరు కలిగి ఉన్నారని గుర్తుంచుకోండి.మీరు పని, సంబంధాలు, ఆటలతో జీవితంలోని ప్రతి క్షణాన్ని ఆస్వాదించండి.జీవితంలో ఉన్న లయను ఆనందించండి.మీరు వేసే ప్రతి అడుగు.

మీ ప్రత్యేకమైన ప్రయాణానికి మరింత ఆనందాన్ని ఇస్తుంది అని చెప్పుకొచ్చింది.దీంతో ఆమె చేసిన వ్యాఖ్యల పట్ల ఫిదా అవుతున్నారు నెటిజన్స్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube