రానా నాయుడు వెబ్ సిరీస్ ఏ సమయాన రిలీజ్ అయిందో కానీ దాని పుణ్యమా అని ప్రస్తుతం స్టార్ హీరోల మైండ్ సెట్ కూడా పూర్తిగా మారిపోయినట్టుగా కనిపిస్తుంది.థియేటర్లో సినిమాలు విడుదల చేస్తే డబ్బులు రావు అనే క్లారిటీ ఓటీటి తర్వాత వచ్చింది కాబట్టి ఓటిటి లో సినిమాలు విడుదల చేసి వర్క్ ఔట్ చేసుకోవాలని కొంతమంది హీరోలు భావిస్తున్నారు.
ఏదైనా సినిమా విడుదల చేసి ఈ కోట్ల రూపాయల ఖర్చుతో థియేటర్లో విడుదల చేస్తే తీరా అక్కడికి వెళ్ళే జనాలే లేరు.అందుకే పెద్ద హీరోలు సైతం ఏదైనా ఓటీటి కంటెంట్ ఉంటే పట్టుకు రండి అని దర్శక నిర్మాతలను అడుగుతున్నారట.
పెద్ద హీరోలైనా చిన్న హీరోలైన మొదట ఓటీటికి ప్రయారిటీ ఇవ్వాలని ఫిక్స్ అయిపోయినట్టుగా కనిపిస్తోంది ప్రస్తుత పరిస్థితి.పైగా సెన్సార్ ప్రాబ్లం కూడా లేదు కాబట్టి ఎంత చెత్త సీనైనా కూడా జనాలు చూడడానికే ఇష్టపడుతున్నారు.

వెంకటేష్ మరియు రానా (Rana)సంయుక్తంగా నటించిన రానా నాయుడు వెబ్ సిరీస్(Rana Naidu web series) ప్రస్తుతం అతి బూతులతో కూడిన వెబ్ సిరీస్ గా పేరు సంపాదించుకున్న పెండింగ్ లో కూడా ఉంది.అందుకే వెంకటేష్(Venkatesh) లాంటి హీరో చేస్తే లేని తప్పు మనం చేస్తే ఏముంది అని కొంతమంది చిన్న హీరోలు భావిస్తున్నారట.వీలైనంత అడల్ట్ కంటెంట్ ఉండేలా చూసుకోవాలని కథ రాసే సమయంలోనే జాగ్రత్తలు చెబుతున్నారట కొంతమంది హీరోలు.మరి ఇలా పెద్ద హీరోలు చేస్తే చిన్న హీరోలను కాదని వారు ఎవరుంటారు చెప్పండి దాంతో రానున్న రోజుల్లో మరింత మసాలా రావడంలో ఎలాంటి సందేహం లేదు.
అవసరం ఉన్న లేకపోయినా ఆ శృంగార సన్నివేశాలను ఎక్కువగా చూపించారనే అపవాదు వెంకటేష్, రానా మూట కట్టుకున్నారు.

ఇక రానున్న రోజుల్లో శృంగార నాయకి లను లేదా పోర్న్ స్టార్స్ ని పక్కన పెట్టి మరి మన హీరోలే నటించే విధంగా కనిపిస్తోంది.అడ్డు అదుపు లేని ఇంతటి శృంగారం వల్ల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది.ఓటిటి కి కూడా సెన్సార్ కటింగ్ ఉంటే బాగుంటుంది అని పలువురు వ్యాఖ్యానాలు చేస్తున్నారు.
చిన్న పిల్లలతో, ఫ్యామిలీతో కలిసి చూడలేని సినిమాలను మన హీరోలు ఇలా ఎంకరేజ్ చేస్తూ ఉంటే దారుణమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది.చిన్నపిల్లల్లోనే కౌమార దశలో వారికి శృంగార కోరికలు పెరిగే అవకాశం కూడా లేకపోలేదు దీనివల్ల అఘాయిత్యాలు కూడా జరిగే అవకాశం ఉంది.
దయచేసి ఇకనైనా ఇలాంటి సినిమాలు తీయడం ఆపేస్తే బాగుంటుంది అని ప్రతి ఒక్క తల్లి తండ్రి కోరుకుంటున్నారు.