ఎన్టీఆర్ కు విలన్ గా శివగామి.. అలాంటి పాత్రలో..?

గత కొన్నేళ్లుగా త్రివిక్రమ్ తన దర్శకత్వంలో తెరకెక్కే ప్రతి సినిమాలో సీనియర్ నటీమణులు ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అత్తారింటికి దారేది సినిమాలో నదియా, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో స్నేహ, అల వైకుంఠపురములో సినిమాలో టబులకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఇచ్చారు.

 Ramya Krishnan Plays A Key Role In Ntr Trivikram Combination Movie,trivikram ,nt-TeluguStop.com

త్రివిక్రమ్ తన దర్శకత్వంలో ఎన్టీఆర్ తో తీయబోయే సినిమాలో కూడా ఒక మంచి పాత్ర ఉందని ఆ పాత్రలో రమ్యకృష్ణ నటించనున్నారని తెలుస్తోంది.

ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన అరవింద సమేత వీర రాఘవ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కాగా త్రివిక్రమ్ ఎన్టీఆర్ కు మరో కథ చెప్పడం ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది.

అయితే అదే సమయంలో రాజమౌళి ఎన్టీఆర్ కు ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమురం భీమ్ పాత్ర ఆఫర్ చేయడంతో ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా ఆలస్యమైంది.వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి త్రివిక్రమ్ ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను ప్రారంభించనుండగా మార్చిలో ఎన్టీఆర్ ఈ సినిమా షూటింగ్ లో అడుగుపెట్టనున్నాడు.

అయినను పోయిరావలె హస్తినకు అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కనున్నట్టు వార్తలు వినిపిస్తుండగా టైటిల్ ను చిత్ర యూనిట్ ధృవీకరించాల్సి ఉంది.బాహుబలి సిరీస్ సినిమాల ద్వారా శివగామి పాత్రతో మెప్పించిన రమ్యకృష్ణ ఆ తరువాత పరిమితంగా పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాల్లో మాత్రమే నటిస్తున్నారు.

త్రివిక్రమ్ సినిమాలో రాజకీయ నాయకురాలి పాత్రలో రమ్యకృష్ణ నటించనుందని ఈ పాత్రను త్రివిక్రమ్ చాలా పవర్ ఫుల్ గా తీర్చిదిద్దాడని సమాచారం.ఈ సినిమాలో రమ్యకృష్ణ ఎన్టీఆర్ కు విలన్ గా నటించనున్నారని తెలుస్తోంది.

Telugu Trivikram-Latest News - Telugu

15 సంవత్సరాల క్రితం ఎన్టీఆర్ నటించిన నా అల్లుడు అనే సినిమాలో రమ్యకృష్ణ అత్త పాత్రలో నటించింది.అయితే బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది.ఎన్టీఆర్ నటించిన సింహాద్రి సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ లో కూడా రమ్యకృష్ణ నటించారు.ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కే సినిమా వచ్చే ఏడాది చివరలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube