ఈ మధ్య కాలంలో సీనియర్ నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి నరేష్ పవిత్రలపై సంచలన ఆరోపణలు చేస్తుండగా ఆ ఆరోపణలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే.నెటిజన్లలో కొంతమంది నరేష్ ను సపోర్ట్ చేస్తుంటే మరి కొందరు రమ్య రఘుపతిని సపోర్ట్ చేస్తున్నారు.
పవిత్ర లోకేశ్ గురించి మాత్రం ఎక్కువమంది నెగిటివ్ కామెంట్లు చేస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది.
అయితే తాజాగా రమ్య రఘుపతి మాట్లాడుతూ నరేశ్ విడాకులు కావాలని పిటిషన్ వేశారని అదే నాకు ఆధారమని తెలిపారు.
నేను కూడా నరేశ్ పై ఆరోపణలు చేశానని అయితే నేను చేసిన ఆరోపణలకు సంబంధించి నా దగ్గర ఆధారాలు ఉన్నాయని రమ్య రఘుపతి చెప్పుకొచ్చారు.విడాకుల కేసు ప్రస్తుతం కోర్టులో ఉందని ఆ కేసు గురించి నేను మాట్లాడటం సరి కాదని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.
విడాకులు వద్దని నేను కోరుకుంటున్నానని రమ్య రఘుపతి చెప్పుకొచ్చారు.ఆర్థికపరమైన కారణాల వల్లే నరేష్ కు పవిత్ర దగ్గరయ్యారని రమ్య రఘుపతి వెల్లడించారు.నరేశ్ ఎప్పటికైనా మారతారని గతంలో అత్తయ్య చెప్పేవారని రమ్య అన్నారు.ఆర్య సమాజ్ లో నరేష్ తో నాకు పెళ్లి జరిగిందని ఏ సమస్య ఉన్నా కోర్టులో తేల్చుకుంటానని రమ్య రఘుపతి అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇంట్లో అడిగేవారు ఎవరూ లేకపోవడంతో నరేష్ కు పవిత్ర లోకేశ్ దగ్గరయ్యారని రమ్య రఘుపతి కామెంట్లు చేశారు.నాకు ఆస్తి కంటే నా కొడుకు జీవితమే ముఖ్యమని రమ్య రఘుపతి అన్నారు.అయితే రమ్య రఘుపతి ఎన్ని ఆరోపణలు చేస్తున్నా నరేష్ కానీ పవిత్ర లోకేశ్ కానీ ఈ ఆరోపణల గురించి స్పందించడానికి ఇష్టపడటం లేదు.రమ్య రఘుపతి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.