సాధారణంగా మీడియాకు, ఇంటర్వ్యూలకు దూరంగా ఉండే రమ్య రఘుపతి తాజాగా ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇవ్వడంతో పాటు ఆ ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలను బయటపెట్టారు. నరేష్ పవిత్ర లోకేశ్ గత నెల 31వ తేదీన త్వరలో తమ పెళ్లి జరగనుందంటూ వీడియో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.
అయితే ఆ వీడియో ఒక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా షేర్ చేసిన వీడియో అని సమాచారం.
మళ్లీ పెళ్లి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆ వీడియోను రిలీజ్ చేశారని తెలుస్తోంది.
అయితే రమ్య రఘుపతి తాజా ఇంటర్వ్యూలో నరేష్ పవిత్రల పెళ్లి జరగదని కామెంట్లు చేశారు.నన్ను వదిలించుకోవాలనే ఆలోచనతో నరేష్ ఎన్నో దారుణాలు చేశాడని రమ్య అన్నారు.
దేవుడిలాంటి కృష్ణగారితో నాకు అక్రమ సంబంధం అంటగట్టాడని రమ్య రఘుపతి కామెంట్లు చేశారు.నా నుంచి కృష్ణకు ప్రాణహాని ఉన్నట్టు ఒక లెటర్ రాయడంతో పాటు కృష్ణ సంతకాన్ని నరేష్ ఫోర్జరీ చేశాడని ఆమె చెప్పుకొచ్చారు.
ఈ విషయం కృష్ణగారికి కూడా తెలియదని రమ్య రఘుపతి చెప్పుకొచ్చారు.నా దగ్గర ఆధారాలు ఉన్నా కృష్ణగారి కుటుంబం పరువు ప్రతిష్టలను దృష్టిలో ఉంచుకుని వాటిని నేను బయటపెట్టడం లేదని రమ్య రఘుపతి కామెంట్లు చేయగా ఆ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.పవిత్ర తొలిసారి కలిసిన సమయంలో నా చేతితో అన్నం పెట్టానని ఇప్పుడామె నాకు సున్నం పెట్టాలని చూస్తోందని రమ్య రఘుపతి చెప్పుకొచ్చారు.
నా కుమారుడు నాన్న కావాలని అడుగుతున్నాడని అందువల్ల నరేష్ కు నేను విడాకులు ఇవ్వాలని భావించడం లేదని ఆమె చెప్పుకొచ్చారు.
నరేష్ నాకు ఎవరెవరితోనో లింకులు కలిపాడని రమ్య రఘుపతి కామెంట్లు చేశారు.నా కొడుకు నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడని ఆమె అన్నారు.