మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ( Ramcharan Tej ) ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.
ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయంలో నటిస్తున్నారు రామ్ చరణ్ నటించిన RRR సినిమా తర్వాత అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి ఈ సినిమాపై అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధం కావాల్సి ఉన్నటువంటి ఈ సినిమా కొన్ని కారణాల వల్ల సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తుంది.

ఇక ఈ సినిమా( Game Changer ) ఎప్పుడు విడుదల అవుతుందన్న విషయంపై కూడా క్లారిటీ ఇవ్వలేదు గతంలో ఈ సినిమా వచ్చేయేడాది సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల కాబోతుంది అని చెప్పినప్పటికీ ప్రస్తుతం మాత్రం వాయిదా పడిందని చెప్పాలి.ఇక ఈ సినిమా విడుదల తేదీ గురించి ఎలాంటి క్లారిటీ లేదు.అలాగే ఈ సినిమా షూటింగ్ ఎక్కడ వరకు వచ్చింది ఏంటి అన్న అప్డేట్స్ కూడా మేకర్స్ వెల్లడించలేదు దీంతో దర్శక నిర్మాతలపై అభిమానులు ఎంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇక ఈ సినిమా 2025 సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల కాబోతుంది అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అయితే మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోవడంతో ఈ విషయంపై కూడా క్లారిటీ లేదు.

ఇలా ఈ సినిమా విషయంలో దర్శక నిర్మాతలు చాలా మౌనంగా ఉండడంతో ఓపిక నశించినటువంటి ఒక అభిమాని ఏకంగా నిర్మాతకు సూసైడ్ లెటర్ రాశారు.ఇందులో ఏముంది అనే విషయానికి వస్తే ఇన్ని రోజులు ఈ సినిమా అప్డేట్ కోసం చాలా ఓపికగా ఎదురు చూశాను.దురదృష్టవశాత్తు ప్రొడక్షన్ టీం నుంచి ఏ విధమైనటువంటి అప్డేట్స్ లేవు.
నేను ప్రొడక్షన్ టీం వారికి మూడు రోజులు సమయం ఇస్తున్నాను ఇంతలో ఈ సినిమా విడుదల తేదీ అలాగే సినిమా గురించి అప్డేట్ ఇవ్వాలి లేకపోతే నేను సూసైడ్ చేసుకొని చస్తాను అంటూ బెదిరిస్తూ లెటర్ రాశారు.నా చావు కారణం డైరెక్టర్ శంకర్( Director Shankar ) నిర్మాత దిల్ రాజు అలాగే ఎస్ వి సి ప్రొడక్షన్ టీమ్ వారే కారణం అంటూ ఈయన చెప్పుకొచ్చారు.
ఇలా సినిమా అప్డేట్ కోసం ఏకంగా సూసైడ్ చేసుకుంటాను అంటూ రాంచరణ్ అభిమాని రాసినటువంటి ఈ లేఖ వైరల్ గా మారడంతో హీరోలు అంటే అభిమానం ఉండాలి కానీ ఇలా చస్తామంటూ బెదిరించేలా ఉండకూడదనీ కామెంట్స్ చేస్తున్నారు.







