30 ఏళ్ల క్రితం దూరదర్శన్ లో ప్రసారం అయిన రామాయణ్ పౌరాణిక సీరియల్ అప్పట్లో టెలివిజన్ మీద అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకుంది.అలాగే ఆ సీరియల్ తో పాటు మంచి ఇంటరెస్టింగ్ సీరియల్స్ ఎన్నో వచ్చాయి.
రామానంద్ సాగర్ దర్శకత్వంలో వచ్చిన ఆ సీరియల్ తో పాటు మహా భారత్, శక్తిమాన్, సర్కస్, శ్రీకృష్ణ సీరియల్స్ ని లాక్ డౌన్ కారణంగా ప్రజల నుంచి అభ్యర్ధన రావడంతో మరల దూరదర్శన్ లో ప్రసారం చేశారు.మార్చి 28 నుంచి రామాయణ్ రోజుకు రెండు భాగాల చొప్పున ప్రసారమవుతుంది.
ఇక తిరిగిన మళ్ళీ ప్రసారం అవుతున్న ఈ సీరియల్ లో రికార్డు స్థాయిలో ప్రజలు చూస్తూ మంచి ప్రజాదారణతో దూసుకుపోతుంది.ప్రస్తుతం మార్కెట్ ని శాసిస్తున్న చానల్స్ లో సీరియల్స్ కి రానటువంటి వ్యూయర్ షిప్ ఈ సీరియల్ కి వస్తుంది.ఏప్రిల్ 16న రాత్రి 9 గంటలకు ప్రసారమైన ఎపిసోడ్ ను 7.7 కోట్ల మంది వీక్షించారని ప్రసార భారతి తన ట్విట్టర్ ఖాతాలో అధికారికంగా ప్రకటించింది.రీ టెలికాస్ట్ లో భాగంగా ప్రసారమైన సీరియళ్లలో అత్యధికంగా వ్యూస్ సాధించిన సీరియల్ గా రామాయణ్ నిలిచిందని పేర్కొంది.ప్రపంచంలో ఏ ఇతర సీరియల్ కూడా ఈ స్థాయిలో వ్యూస్ సొంతం చేసుకోకపోవడం ఓ విధంగా ప్రపంచ రికార్డు అని చెప్పాలి.
మొత్తానికి రామాయణ్ సీరియల్ కి ఎంత ప్రజాదారణ ఉందో దీని ద్వారా మరోసారి రుజువు అయ్యింది.







