సినిమాల్లోకి రావడం సులువే అయినా సక్సెస్ కావడం సులువు కాదనే సంగతి తెలిసిందే.టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ ప్రొడ్యూసర్లలో రామానాయుడు ఒకరు కాగా 300 ఎకరాలు అమ్ముకుని సినిమా ఇండస్ట్రీకి వచ్చానని ఒక సందర్భంలో ఆయన తెలిపారు.
రామానాయుడు నిర్మించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు అంచనాలు మించి సక్సెస్ ను సొంతం చేసుకోవడంతో పాటు డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలను అందించాయి.
నమ్మిన బంటు సినిమాలో ఏఎన్నార్ కు డూప్ గా నేను చేశానని ఆయన తెలిపారు.
ఏం చేసినా నంబర్ వన్ ఉండాలని నేను అనుకునే వాడినని రామానాయుడు అన్నారు.నేను మేనత్త కూతురిని పెళ్లి చేసుకున్నానని ఆయన తెలిపారు.వ్యవసాయంలో కొన్నిసార్లు ఎదురుదెబ్బలు తగిలాయని రామానాయుడు కామెంట్లు చేశారు.ఆ రైస్ మిల్లుకు సేల్స్ ట్యాక్స్ ఎక్కువగా వేశారని ఆయన అన్నారు.

ఆ తర్వాత బ్రిక్స్ బిజినెస్ చేశానని రామానాయుడు తెలిపారు.మా మామయ్య రియల్ ఎస్టేట్ చేయాలని సూచించారని ఆయన అన్నారు.అనురాగం అనే సినిమాకు నేను పార్ట్నర్ అయినా నా పేరు పడలేదని రామానాయుడు తెలిపారు.మా నాన్న సినీ ఫీల్డ్ వద్దని చెప్పారని ఆయన కామెంట్లు చేయడం గమనార్హం.
శోభన్ బాబు నాకు ఫ్రెండ్ అని రామానాయుడు అన్నారు.శోభన్ బాబు సంపాదించిన డబ్బుతో ప్రాపర్టీస్ కొనేవారని ఆయన తెలిపారు.

శివాజీ గణేషన్ చాలా బాగా జోక్స్ వేసెసివారని రామానాయుడు అన్నారు.హీరోయిన్ల విషయంలో నేను కేర్ తీసుకునేవాడినని ఆయన తెలిపారు.నా భార్య షూటింగ్ కు ఎప్పుడూ రాలేదని రామానాయుడు చెప్పుకొచ్చారు.రామానాయుడు వారసులు సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.గతంలో నిర్మాత రామానాయుడు వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.







