భారీ నష్టాలను మూట కట్టుకున్న రామారావు ఆన్ డ్యూటీ.. ఎన్ని కోట్లు తెలుసా?

మాస్ మహారాజా రవితేజ క్రాక్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు.ఈ సినిమా మంచి విజయం కావడంతో ఈయనకు వరుస సినిమా అవకాశాలు వస్తున్నాయి అయితే తన తదుపరి సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ కావడం గమనార్హం.

 Rama Rao On Duty Who Has Covered Huge Losses Do You Know How Many Crores Rama Rao On Duty, Raviteja, Sarat Mandal, Krack, Divyansha Kaushik, Rajisha Vijian-TeluguStop.com

తాజాగా శరత్ మండల దర్శకత్వంలో రవితేజ దివ్యాంశా కౌశిక్, రజిషా విజియన్ హీరో హీరోయిన్లుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం రామారావు ఆన్ డ్యూటీ.ఈ సినిమా గత నెల 29వ తేదీ ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇకపోతే ఈ సినిమాలో రవితేజ ఒక పవర్ ఫుల్ ప్రభుత్వ ఉన్నతాధికారి ఎమ్మార్వో పాత్రలో కనిపించి సందడి చేశారు.ఈ క్రమంలోనే అవినీతిపరులైన రాజకీయ నాయకుల భరతం పట్టే అధికారి రామారావు అనే పాత్రలో రవితేజ సందడి చేశారు.

 Rama Rao On Duty Who Has Covered Huge Losses Do You Know How Many Crores Rama Rao On Duty, Raviteja, Sarat Mandal, Krack, Divyansha Kaushik, Rajisha Vijian-భారీ నష్టాలను మూట కట్టుకున్న రామారావు ఆన్ డ్యూటీ.. ఎన్ని కోట్లు తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది.ఇకపోతే ఈ సినిమా 17.72 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే 18 కోట్ల షేర్ రాబట్టాలి.

Telugu Krack, Rajisha Vijian, Rama Rao Duty, Raviteja, Sarat-Movie

ఇక ఈ సినిమా మాత్రం 5.19 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది.దీంతో ఈ సినిమా ఏకంగా 12.53 కోట్ల రూపాయల నష్టాన్ని ఎదుర్కొని డిజాస్టర్ గా నిలిచిపోయిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.ఇకపోతే ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సమస్థ సోనీ లైవ్ దక్కించుకుంది.ఇక ఈ సినిమాని థియేటర్ రన్ పూర్తయిన 8 వారాల తర్వాత విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

థియేటర్లో డిజాస్టర్ టాక్ ఎదుర్కొన్న ఈ సినిమా డిజిటల్ మీడియాలో అయినా మంచి ఆదరణ పొందుతుందో లేదో తెలియాల్సి ఉంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube