మూవీ మొగల్ గా సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించిన రామానాయుడు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో కూడా చోటు సంపాదించారు.అప్పట్లో రామానాయుడు ( Rama naidu ) తన ఉనికిని చాటుకోవడం కోసం తెలుగులో హిట్ అయిన సినిమాలను మలయాళ,కన్నడ, హిందీలలో రీమేక్ చేస్తూ అలాగే హిందీలో,కన్నడలో హిట్ అయిన సినిమాలను తెలుగులో, ఒరియా భాషల్లో రీమేక్ చేస్తూ దాదాపు 100కు పైగా సినిమాలకు నిర్మాతగా వ్యవహరించి స్టార్ నిర్మాతగా పేరు సంపాదించారు.
అలాంటి రామానాయుడు తన ఇద్దరు కొడుకులను ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా తీర్చిదిద్దాలని ఎన్నో కలలు కన్నారు.కానీ పెద్దకొడుకు సురేష్ బాబు ( Suresh babu ) కాస్త సిగ్గు, బిడియం ఉండడంతో ఆయనను హీరోగా చేయలేకపోయారు.
కానీ నిర్మాతగా మాత్రం ఆయనకు బాధ్యతలు అప్పగించారు.ఇక వెంకటేష్ ని చదువు పూర్తి చేశాక కలియుగ పాండవులు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేశారు.ఈ సినిమా హిట్ తర్వాత వరుసగా సినిమాల్లో అవకాశాలు వచ్చాయి.అయితే సినిమాల్లోకి రాకముందే వెంకటేష్ కి రామానాయుడు పెళ్లి చేశారట.

వెంకటేష్ నీరజలకు నలుగురు పిల్లలు కూడా ఉన్నారు.ఇక వెంకటేష్ ( Venkatesh ) సినిమాల్లోకి వచ్చాక హీరోయిన్ సౌందర్య ప్రేమలో మునిగిపోయారు.దాంతో ఈమెతో కలిసి వరుసగా సూపర్ పోలీస్ సినిమా తర్వాత ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, పవిత్ర బంధం,( Pavitra Bandham ) పెళ్లి చేసుకుందాం రా, రాజా,( Raja movie )జయం మనదేరా,దేవి పుత్రుడు వంటి సినిమాల్లో నటించాడు.అయితే అప్పటికే సౌందర్యతో పీకల్లోతు ప్రేమలో ఉన్న వెంకటేష్ కి రామానాయుడు ఎన్నిసార్లు నచ్చజెప్పినా కూడా అస్సలు వినలేదట.
ఇక కొడుకు మాట వినడం లేదని సౌందర్య ( Soundarya ) దగ్గరికి వెళ్లి తనకి ఇప్పటికే పెళ్లై నలుగురు పిల్లలు ఉన్నారు.నా కోడలు బాధపడుతుంది అంటూ సౌందర్యతో చెప్పారట.
కానీ సౌందర్య మాత్రం మీరు అనుకుంటున్నట్లు నాకైతే అలాంటి ఫీలింగ్ లేదు అని చెప్పిందట.దాంతో వెంకటేష్ కి సౌందర్య మీద ఉండే ప్రేమ చెడిపోవాలంటే నువ్వు రాఖీ కట్టాలి అని రామానాయుడు సౌందర్య కి చెప్పారట.
ఇక సౌందర్య కి కూడా తనలో ఎలాంటి ఫీలింగ్ లేదు అని వెంకటేష్ కి రాఖీ కట్టి తమ మధ్య ఎలాంటి బంధం లేదు అని చెప్పేసిందట.

ఇక ఈ విషయంలో వెంకటేష్ ( Venkatesh ) చాలా బాధపడ్డాప్పటికీ ఆ తర్వాత కుటుంబం గురించి ఆలోచించారు.ఇక సౌందర్య ఎప్పుడైతే వెంకటేష్ కి రాఖీ కట్టిందో అప్పటినుండి వీరి కాంబినేషన్లో ఒక్క సినిమా కూడా రాలేదు.ఆ తర్వాత సౌందర్య పెళ్లి చేసుకున్న సంవత్సరానికే విమాన ప్రమాదంలో మరణించింది.