ఆదిపురుష్ సెకండ్ సింగిల్ కు డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

ఇతిహాస గ్రంధం రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ”ఆదిపురుష్( Adipurush )”.పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కింది.

 Ram Siya Ram Second Single From Prabhas Adipurush, Adipurush, Prabhas, Saif Ali-TeluguStop.com

ఈ సినిమాను టి సిరీస్ సంస్థ, రిట్రో ఫైల్స్ 500 కోట్ల భారీ బడ్జెట్ తో సంయుక్తంగా నిర్మించారు.ఈ సినిమాలో ప్రభాస్( Prabha ) రాముడి పాత్రలో నటించగా.

బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సీతగా నటించింది.అలాగే సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడిగా నటిస్తుండగా.

సన్నీ సింగ్ ( Sunny Singh )లక్షణుడిగా నటిస్తున్నాడు.వచ్చే నెల గ్రాండ్ రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈ సినిమా నుండి వరుసగా అప్డేట్ లను ఇస్తూ మరింత క్రేజ్ పెంచుతున్న విషయం తెలిసిందే.

Telugu Adipurush, Bollywood, Prabhas, Ramsiya, Ram Siya Ram, Sunny Singh, Tollyw

ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేసి అంచనాలు పెంచారు.ఆ తర్వాత ఫస్ట్ సింగిల్ జై శ్రీరామ్ తో మరిన్ని అంచనాలు క్రియేట్ చేసి పాజిటివ్ బజ్ ఏర్పడేలా చేసారు.ఇక ఇప్పుడు ఈ సినిమా నుండి సెకండ్ సింగిల్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట.రెండవ సాంగ్ ను మే 29న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తుండగా ఈ సాంగ్ కు కూడా అదిరిపోయే ప్లానింగ్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

Telugu Adipurush, Bollywood, Prabhas, Ramsiya, Ram Siya Ram, Sunny Singh, Tollyw

మే 29న వరల్డ్ వైడ్ గా ముఖ్యంగా నార్త్ మార్కెట్ లో అయితే అనేక టీవీ ఛానెల్స్, మ్యూజిక్ ప్లాట్ ఫామ్ లు, యూట్యూబ్, రేడియో స్టేషన్ లలో ఏకకాలంలో రిలీజ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఇది కూడా బిగ్గెస్ట్ ప్లాన్ లలో ఒకటి అని తెలుస్తుంది.మరి ఈ సాంగ్ ఎలా ఉంటుందో వేచి చూడాలి.ఇక జూన్ 6న తిరుపతిలో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపబోతున్నట్టు మేకర్స్ అనౌన్స్ చేసారు.ఇక జూన్ 16న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా రిలీజ్ తర్వాత ఎన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube